హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

లైంగిక వేధింపుల నోటీసు, సారీ చాలదన్న విక్టిమ్

|
Google Oneindia TeluguNews

Woman scientist
హైదరాబాద్: నగరంలోని మెట్ట భూములకు సంబంధించిన అంతర్జాతీయ పంటల పరిశోధన సంస్థ (ఇంటర్నేషనల్ క్రాప్స్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఫర్ ది సెమి ఎరిడ్ ట్రాపిక్స్-ఇక్రిశాట్)లో శాస్త్రవేత్తగా విధులు నిర్వహిస్తున్న ఓ మహిళ(28) తన సీనియర్ ఉద్యోగి లైంగికంగా వేధిస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు గత సంవత్సరం జనవరిలోనే ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదంటూ ఇక్రిశాట్ యాజమాన్యానికి లీగల్ నోటీసు ఇచ్చారు.

ఇప్పటికీ అతనిపై ఎలాంటి చర్య తీసుకోలేదనీ, అదే వ్యక్తితో కలిసి ఒకే విభాగంలో పని చేయాల్సి వస్తోందని, ఇద్దరిలో ఎవరికీ స్థానం మార్చలేదని తన నోటీసులో బాధిత మహిళా శాస్త్రవేత్త పేర్కొన్నారు. కాగా ఇక్రిశాట్ పాలక మండలి అధ్యక్షుడు ఎస్‌జె పూలె ఈ నోటీసుపై స్పందించారు. బాధితురాలి ఫిర్యాదును మళ్లీ పరిశీలించాల్సిందిగా యాజమాన్యాన్ని కోరతామని తెలిపారు.

సదరు ఉద్యోగితో బాధితురాలికి ఇప్పటికే క్షమాపణలు చెప్పించినట్లు పూలె పేర్కొన్నారు. ఇప్పుడు మళ్లీ విచారణ జరుపుతామని, రానున్న కాలంలో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని ఇక్రిశాట్ అధికార వర్గాలు శుక్రవారం పేర్కొన్నాయి.

అయితే నాలుగు గోడల మధ్య క్షమాపణలు చెప్పించడం ఇందుకు పరిష్కారం కాదని బాధితురాలు పేర్కొన్నారు. సదరు ఉద్యోగి, తాను ఒకే విభాగంలో పని చేయడం వల్ల తనకు ఇబ్బందిగా ఉందని బాధితురాలు తెలిపింది. కాగా తమ ఉద్యోగులపై లైంగిక వేధింపుల లాంటి సంఘటనలు సహించబోమని, ఇలాంటి సంఘటనలకు పాల్పడిన వారిపై తగిన చర్యలు తీసుకుంటామని ఇక్రిశాట్ అధికార వర్గాలు తెలిపాయి.

English summary
A woman scientist working in a leading crops research institute here has alleged sexual harassment by a senior colleague at workplace and slapped a legal notice on the management claiming there was no proper inquiry into her complaint.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X