హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

భర్త చెంపపై చెల్లుమనిపించిన మహిళ (ఫొటోలు)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తనకు న్యాయం చేయాలంటూ ఓ మహిళ ఆదివారం నగరంలోని బాపూజీ‌నగర్‌లోని అత్తగారింటి ముందు మహిళా సంఘాలతో కలిసి ధర్నా చేసింది. ఒక దశలో ఆగ్రహానికి గురైన మహిళా సంఘాలు బాధితురాలి అత్తామామలపై దాడి చేసేందుకు ప్రయత్నించారు. దీంతో ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. బోడుప్పల్‌కు చెందిన స్వప్నకు, బాపూజీనగర్‌కు చెందిన ప్రభాకర్‌కు 2009, నవంబర్ 29న వివాహం జరిగింది. పెళ్లయిన కొద్ది రోజులకే భార్యాభర్తల మధ్య విభేదాలు చోటుచేసుకున్నాయి. దీంతో తనను ఇంట్లోకి రానివ్వడం లేదంటూ మేడిపల్లి పోలీస్‌స్టేషన్‌లో భర్త, అత్తమామలపై స్వప్న ఫిర్యాదు చేసింది. దీనిపై కోర్టులో కేసు కూడా నడుస్తోంది. కాగా తనకు న్యాయం చేయాలంటూ బాధిత మహిళ, ఆదివారం రోజు మహిళా సంఘాలు, కుటుంబ సభ్యులతో కలిసి అత్తగారింటి ఎదుట ధర్నాకు దిగింది.

తనను తన అత్తింట్లోకి తీసుకెళ్లాలని, లేదంటే పెళ్లి సమయంలో ఇచ్చిన ఇచ్చిన మొత్తంతోపాటు నష్ట పరిహారం చెల్లించాలని స్వప్న డిమాండ్ చేసింది. ఈ విషయంలో అత్తామామలు, భర్త ఎలాంటి హామీ ఇవ్వకపోవడంతో స్వప్నకు మద్దతుగా వచ్చిన మహిళా సంఘాల నేతలు ఇంట్లోకి చొరబడి వారిపై దాడి చేసేందుకు యత్నించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు వారిని అడ్డుకున్నారు.

ఇరువర్గాలు మాట్లాడుకుని సమస్యను పరిష్కరించుకుకోవాలని పోలీసులు వారికి సూచించారు. దీంతో సమస్యను పరిష్కరించుకునేందుకు ఇరువర్గాల పెద్దలు అంగీకారం తెలపడంతో మహిళా సంఘాలు శాంతించాయి. అత్తింటి తరపు పెద్దలు స్వప్నకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో మహిళా సంఘాల సభ్యలు ధర్నా విరమించి అక్కడ్నుంచి వెళ్లిపోయారు.

ధర్నా చేస్తున్న స్వప్నస

ధర్నా చేస్తున్న స్వప్నస

తనకు న్యాయం చేయాలంటూ ఆదివారం నగరంలోని బాపూజీ‌నగర్‌లోని అత్తగారింటి ముందు బాధితురాలు స్వప్న మహిళా సంఘాలతో కలిసి ధర్నా చేసింది.

గొడవకు దిగిన మహిళా సంఘాలు

గొడవకు దిగిన మహిళా సంఘాలు

తనకు న్యాయం చేయాలంటూ ఆదివారం నగరంలోని బాపూజీ‌నగర్‌లోని అత్తగారింటి ముందు బాధితురాలు స్వప్న మహిళా సంఘాలతో కలిసి ధర్నా చేసింది. బాధితురాలికి న్యాయం చేయాలంటూ అమె అత్తగారింటి కుటుంబ సభ్యులతో గొడవకు దిగిన మహిళా సంఘాల నేతలు.

ఇంట్లోకి చొచ్చుకుని..

ఇంట్లోకి చొచ్చుకుని..

తనకు న్యాయం చేయాలంటూ ఆదివారం నగరంలోని బాపూజీ‌నగర్‌లోని అత్తగారింటి ముందు బాధితురాలు స్వప్న మహిళా సంఘాలతో కలిసి ధర్నా చేసింది. ఇంట్లోకి చొచ్చుకుని వెళ్లే ప్రయత్నం చేస్తున్న మహిళా సంఘాల నేతలు.

దాడికి యత్నం

దాడికి యత్నం

తనకు న్యాయం చేయాలంటూ ఆదివారం నగరంలోని బాపూజీ‌నగర్‌లోని అత్తగారింటి ముందు బాధితురాలు స్వప్న మహిళా సంఘాలతో కలిసి ధర్నా చేసింది. స్వప్నకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వకపోవడంతో ఆగ్రహానికి గురైన మహిళా సంఘాల నేతలు ఆమె భర్త, కుటుంబ సభ్యులపై దాడికి యత్నించారు.

పోలీసులు అడ్డుకోవడంతో..

పోలీసులు అడ్డుకోవడంతో..

తనకు న్యాయం చేయాలంటూ ఆదివారం నగరంలోని బాపూజీ‌నగర్‌లోని అత్తగారింటి ముందు బాధితురాలు స్వప్న మహిళా సంఘాలతో కలిసి ధర్నా చేసింది. స్వప్నకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వకపోవడంతో ఆగ్రహానికి గురైన మహిళా సంఘాల నేతలు ఆమె భర్త, కుటుంబ సభ్యులపై దాడికి యత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో గేటుముందు ఆందోళన చేస్తున్న దృశ్యం.

భర్త ప్రభాకర్‌తో స్వప్న

భర్త ప్రభాకర్‌తో స్వప్న

తనకు న్యాయం చేయాలంటూ ఆదివారం నగరంలోని బాపూజీ‌నగర్‌లోని అత్తగారింటి ముందు బాధితురాలు స్వప్న మహిళా సంఘాలతో కలిసి ధర్నా చేసింది. భర్త ప్రభాకర్‌తో వివాహ సమయంలో తీసిన ఫొటోలో స్వప్న.

స్వప్న అత్తింటివారు

స్వప్న అత్తింటివారు

తనకు న్యాయం చేయాలంటూ ఆదివారం నగరంలోని బాపూజీ‌నగర్‌లోని అత్తగారింటి ముందు బాధితురాలు స్వప్న మహిళా సంఘాలతో కలిసి ధర్నా చేసింది. స్వప్న ఆందోళతో ఇంటిముందు కూర్చున్న ఆమె అత్తింటి కుటుంబ సభ్యులు.

English summary
Woman stages Dharna at In-laws house in Bapujinagar in Hyderabad on Sunday for justice.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X