ప్రేమ పెళ్లే, భర్త వరకట్న దాష్టీకం: టెక్కీ ఆత్మహత్య

తన భర్త ఎంతకీ రావడంతో మనస్తాపానికి గురైన టెక్కీ శ్వేత ధర్మారంలో ఆత్మహత్య చేసుకుంది. ధర్మారంలోని ఏలేటి రాంరెడ్డి, భారతి దంపతుల రెండో కూతురు శ్వేత. ఆమె హైదరాబాదులో సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. కడప జిల్లా మైదుకూరు మండలం చిట్టివారిపాలెం గ్రామానికి చెందిన పులిమేర శివశంకర్ రెడ్డి అక్కడే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తుండేవాడు. వీరిద్దరు ప్రేమించుకున్నారు.
తమ తల్లిదండ్రులను ఒప్పించి వారు 2012 ఏప్రిల్ 8వ తేదీన వివాహం చేసుకున్నారు వివాహసమయంలో కట్నకానుకలు కూడా ఇచ్చారు. పెళ్లయిన కొన్ని రోజులకు కట్నం కావాలంటూ శివశంకర్ రెడ్డి శ్వేతను వేధించడం ప్రారంభించాడనే ఆరోపణలు ఉన్నాయి. దాంతో 30 లక్షల రూపాయల విలువైన భూమిని ఇచ్చేందుకు శ్వేత తల్లిదండ్రులు సిద్ధపడ్డారు.
తనకు భూమి అవసరం లేదని, నగదు కావాలని శివశంకర్ రెడ్డి పట్టుబట్టాడు. నగదు లేదని చెప్పినా వినలేదు. దాంతో ఆరు నెలల గర్భవతి అయిన శ్వేతను శివశంకర్ రెడ్డి పుట్టింటికి పంపించాడు. కుమారుడు పుట్టాడని ఫోన్ చేసినా అతను రాలేదు. దీంతో మనస్తాపానికి గురైన శ్వేత ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. దీంతో శివశంకర్ రెడ్డ కుటుంబ సభ్యులపై శ్వేత తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.












Click it and Unblock the Notifications