రెండో పెళ్లి: భర్త ఇంటిముందు ధర్నా, సూసైడ్‌యత్నం
తిరుపతి: చిత్తూరు జిల్లాలో ఓ మహిళ పోలీస్ స్టేషన్‌లో ఆత్మహత్యాయత్నం చేసింది. తన భర్త తనకు అన్యాయం చేస్తున్నాడని రెండు రోజులుగా ఆయన ఇంటి ముందు ఆందోళన చేస్తున్నా పట్టించుకోలేదని, పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆమె ఆత్మహత్యాయత్నం చేసింది.
భర్త రెండో పెళ్లి చేసుకుని తనను ఇంట్లోకి రానివ్వకుండా వేధిస్తున్నాడని ఆరోపిస్తూ రెండు రోజులుగా తిరుపతిలో భర్త ఇంటి ఎదుట ధర్నా చేస్తున్న రాధిక అనే మహిళ ఈ చర్యకు పాల్పడింది. తనకు న్యాయం జరిగే వరకూ భర్త ఇంటి ముందు నుంచి కదిలేది లేదని చెబుతూ.. రెండు రోజుల క్రితం ఆమె భర్త ఇంటికి చేరుకుని ధర్నా చేపట్టింది.

దీంతో గ్రామంలోని మహిళా సంఘాలు కూడా రెండుగా చీలిపోయి ఇరువర్గాలకు వత్తాసు పలికారు. గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. విషయం పోలీసులు రాధికను తిరుపతి మహిళా పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
అయితే తనకు పోలీసులు న్యాయం చేయడం లేదన్న మనస్తాపంతో స్టేషన్‌లోనే నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పోలీసులు వెంటనే ఆమెను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా, రెండో భార్యకు అన్యాయం జరగనివ్వమని మరికొందరు చెబుతున్నారు. ఆ భర్త మాత్రం తనకు రాధికతో పెళ్లి జరగలేదని చెబుతున్నాడని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications