శ్రీకాకుళం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

శ్రీకాకుళం జిల్లాలో ఎలుగుబంటి బీభత్సం:ఒకరి మృతి,ఆరుగురికి గాయాలు

By Suvarnaraju
|
Google Oneindia TeluguNews

శ్రీకాకుళం:జిల్లాలోని సోంపేట మండలం ఎర్రముక్కాంలో ఎలుగుబంటి బీభత్సం స‌ృష్టించింది. హఠాత్తుగా ఊరిలోకి చొరబడ్డ ఎలుగుబంటి కనిపించిన ప్రతి వారిపై దాడికి దిగింది. ఇలా ఎలుగు బంటికి దాడికి గురైన వారిలో ఊర్మిళ అనే మహిళ ప్రాణాలు కోల్పోయింది.

ఇలా ఎలుగు బంటికి దాడికి గురైన వారిలో ఊర్మిళ అనే మహిళ ఆస్పత్రికి తరలించే లోపే ప్రాణాలు కోల్పోయింది. అంతేకాక మరో ఆరుగురికి గాయాలయ్యాయి. గాయపడ్డవారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించి చికిత్స నిర్వహిస్తున్నారు. ఊహించని విధంగా విరుచుకుపడిన ఎలుగు దాడితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Woman violently killed, 6 injured during Bear attack in Srikakulam district

మరోవైపు దాడి చేసిన ఎలుగు కనిపించకుండా పోవడంతో మళ్లీ ఆ ఎలుగు బంటి ఎక్కడ దాడి చేస్తుందోనని ఎర్రముక్కాం గ్రామంతో పాటు చుట్టు ప్రక్కల గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. మరోవైపు ఎలుగు దాడి సమాచారం తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు గ్రామాన్ని సందర్శంచి వివరాలు తెలుసుకున్నాడు. దాడికి పాల్పడిన ఎలుగును త్వరలోనే పట్టుకొని ఇక్కడ నుంచి అటవీ లోతట్టు ప్రాంతానికి తరలిస్తామని అంటున్నారు.

English summary
Srikakulam district:Panic gripped this area after a woman died and 6 were injured in a bear attack at Erramukkam village in Srikakulam district. All of a sudden a bear attacked on village following which the woman lost her life and oter victims were rushed to nearest health centre for treatment.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X