చిద్దూ కన్నా మన స్త్రీలు తెలివైనవారు: చంద్రబాబు
హైదరాబాద్: కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం కన్నా మన తెలుగింటి ఆడపడుచులు తెలివైనవాళ్లని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రం బాగుపడాలనే తమ ప్రభుత్వ హయాంలో సైబరాబాద్, హైటెక్ సిటీలు నిర్మించినట్లు ఆయన తెలిపారు. ఆయన శుక్రవారంనాడు తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌లో మాట్లాడారు.
తన 9 ఏళ్ల పాలనలో రాష్ట్ర అభివృద్ధి కోసం చాలా కష్టపడ్డానని చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్ర బాగు పడాలనే హైదరాబాద్, హైటెక్ సిటీని అభివృద్ధి చేసినట్లు ఆయన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో దేశంలో, రాష్ట్రంలో అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయిందని ఆరోపించారు.

తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను అన్ని విధాలుగా ఆదుకుంటామని చంద్రబాబు అన్నారు. తన పాలనలోనే ప్రభుత్వ కార్యకలాపాలు సక్రమంగా జరిగాయని తెలిపారు. టిడిపి ప్రభుత్వం రాకముందు రాష్ట్రంలోని మహిళలు బ్యాంకులకు పోయేవాళ్లు కాదని, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే అది జరిగిందని తెలిపారు. కాంగ్రెస్ పాలనలో కోటీశ్వరులు మరింత కోటీశ్వరులు, పేదలు మరింత పేదలు అవుతున్నారని ఆరోపించారు.
తమ పార్టీ అధికారంలోకి వస్తే వృద్ధాప్య పింఛన్లను వేయి రూపాయలకు పెంచుతామని చంద్రబాబు చెప్పారు.












Click it and Unblock the Notifications