పాప అపహరణలో కొత్తమలుపు: బాలిక కిడ్నాప్, క్షేమం

భోలక్‌పూర్‌కు చెందిన షేక్ సాజిద్ భార్య రెహానా ప్రసవ వేదనతో ఆసుపత్రిలో చేరింది. ఈ నెల 7న ఆడ శిశువుకు జన్మనిచ్చింది. 11న ఉదయం శిశువు అపహరణకు గురైంది. రంగంలోకి దిగిన పోలీసులు గాలింపు చేపట్టారు. ప్రత్యక్ష సాక్షి కథనం మేరకు ఊహా చిత్రంతో దర్యాప్తు ప్రారంభించారు. ఊహా చిత్రాలు హసీనా, జరీనాలను పోలి ఉన్నాయి. దీంతో పోలీసులు ఆ దిశలో దర్యాఫ్తు చేశారు.
మరోవైపు గచ్చిబౌలిలో లభ్యమైన ఆడ మృతశిశువు సంఘటనతో ఆ మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించి శిశువు తండ్రి సాజిద్, అమ్మమ్మ, ఫరా ఆసుపత్రి డాక్టర్ ఫరాఖాన్‌ను పిలిచి చూపించారు. మృతదేహం గుర్తుపట్టే వీల్లేని స్థితిలో వుందని, డిఎన్‌ఏ పరీక్ష ద్వారానే సాధ్యమని వైద్యులు చెప్పారు. మరోవైపు ఆ పాప తమ పాప కాదని బాధితులు చెప్పారు. దీంతో బుధవారం డిఎన్ఏ పరీక్షలు నిర్వహించనున్నారు. కాగా, ఈ కిడ్నాప్‌కు సంబంధించి హసీనా, జరీనాలను పోలీసులు ముంబైలో అదుపులోకి తీసుకున్నారు.
చిన్నారి కిడ్నాప్, ఆచూకీ లభ్యం
కృష్ణా జిల్లా విజయవాడలో మంగళవారం రాత్రి ఆరో తరగతి చదువుతున్న శివనాగనందిని అనే చిన్నారి కిడ్నాప్‌కు గురైంది. సత్యనారాయణపురం పోలీసు స్టేషన్ పరిధిలో కాంగ్రెసు నాయకుడు నరేష్ కుమార్తె నిన్న పాఠశాలకు వెళ్లి ఇంటికి రాలేదు. తల్లిదండ్రులు రాత్రి పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు నాలుగు బృందాలుగా ఏర్పడి గాలించారు. ఆమె ఆచూకీ లభ్యమైంది.












Click it and Unblock the Notifications