పిన్ని వరసయ్యే మహిళతో వివాహేతర సంబంధం: భర్తను చెప్పుతో కొట్టిన భార్య
నెల్లూరు: పద్నాలుగేళ్ల క్రితం పెళ్లి చేసుకున్న భార్యను, ఇద్దరు పిల్లల్ని గాలికి వదిలేసి వేరే మహిళతో గుట్టుచప్పుడు కాకుండా సహజీవనం చేస్తున్న భర్తకు దేహశుద్ధి చేశారు. ఎట్టకేలకు భర్త నిజం రూపం తెలుసుకున్న ఆమె, కుటుంబ సభ్యులు... భర్త, ఆ మహిళను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని చితకబాదారు.
ఏకంగా ఆమె తన భర్తపై చెప్పులతో విరుచుకుపడింది. సహజీవనం చేస్తున్న ఆ మహిళ దెబ్బల నుంచి తప్పించుకునేందుకు ఏకంగా అటకెక్కి కూర్చుంది. ఈ సంఘటన సోమవారం ఉదయం నెల్లూరు జిల్లాలో జరిగింది.

వివరాల్లోకి వెళితే... జిల్లాలోని వెంకటాచలం మండలం నిండిగుంటపాలెంలో నివాసముంటున్న వెంకటేశ్ అనే వ్యక్తి స్వప్నను 14 ఏళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కొన్నాళ్ల పాటు వీరి కాపురం సజావుగానే సాగింది. ఆ తర్వాతే ఏ కారణంచేతో కలతలు రేగాయి.
దీంతో 4 ఏళ్ల క్రితం వెంకటేష్ స్వప్నను విడాకులు కోరాడు. ఈ కేసు ప్రస్తుతం కోర్టులో నడుస్తోంది. అప్పటి నుంచి ఇద్దరు పిల్లలతో కలిసి స్వప్న విడిగా ఉంటోంది. ఈ క్రమంలో వెంకటేష్ స్వప్నకు తెలియకుండా మరో మహిళతో సహజీవనం చేస్తున్నాడు.
తన భర్తను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న ఆమె ఆవేశంతో ఊగిపోతూ చెప్పుతో దాడి చేసింది. తన భర్తతో సహజీవనం చేస్తున్న మహిళపై కూడా దాడి చేసేందుకు ప్రయత్నించింది. తనపై దాడి జరుగుతుందని ముందే ఊహించిన ఆమె ఇంట్లోని అటకెక్కి బిక్కుబిక్కుమంటూ కూర్చుంది.
ఇక్కడ కొసమెరుపు ఏంటంటే వెంకటేష్‌తో సహజీవనం చేస్తున్న మహిళ స్వప్నకు దగ్గరి బంధువు కావడమే. అంతేకాదు ఈ మొత్తం వ్యవహారంలో సిగ్గుపడాల్సిన విషయం ఏమిటంటే వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ వెంకటేష్‌కు పిన్ని వరుస అవుతుంది.
ఆయినా సరే ఆమెను వదిలిపెట్టకుండా తీగతో కొడుతున్న తదితర దృశ్యాలను ఓ న్యూస్ ఛానల్ ప్రసారం చేసింది. భర్తను చెప్పుతో ఆవేశంగా బాదిన ఆమె అంతటితో సరిపెట్టుకోకుండా పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది.
తనను పెళ్లి చేసుకుని, వేరే మహిళతో సహజీవనం చేస్తున్న అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది.












Click it and Unblock the Notifications