చెప్పుతో కొడతా..మహిళను దుర్భాషలాడిన టీడీపీ అభ్యర్థి
టీడీపీ అభ్యర్థులకు వరుస షాకులు తగులుతున్నాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ నేతలకు ప్రజల నుంచి నిరసనలు ఎదురవుతున్నాయి.ఇటీవలే తిరువూరు టీడీపీ అభ్యర్థి కొలికపూడి శ్రీనివాస్‌కు ఘోర అవమానం ఎదురైంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయనకు చేదు అనుభవం ఎదురైంది. సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని స్థానికులను కోరగా..అక్కడున్న పలువురు మహిళలు తాము ఫ్యాన్‌కే ఓటు వేస్తామని ధైర్యంగా చెప్పారు.టీడీపీకి ఓటు వేయాలని వచ్చిన నేతలను ఓ సాధారణ మహిళ తన ప్రశ్నలతో వారిని ఉక్కిరిబిక్కిరి చేసింది. వైసీపీ పాలనకు , టీడీపీ పాలనకు తేడాలు వివరిస్తూ ఆ నేతలను ఓ ఆట ఆడుకుంది.
మీరు ఇప్పటి వరకు చాలా ప్రభుత్వాలు చూశారు.. ఎప్పుడైనా ఇలాంటి పాలన చూశారా అంటూ టీడీపీ నేతలను ప్రశ్నించింది ఆ మహిళ. 1 తేదీనే ఉదయం 7 గంటలకే పింఛన్లు తలుపు కొట్టి మరీ అందిస్తున్నారని ఆ మహిళ తెలిపింది.టీడీపీకి ఓటు వేయాలని వచ్చిన నేతలను ఓ సాధారణ మహిళ తన ప్రశ్నలతో వారిని ఉక్కిరిబిక్కిరి చేసింది. వైసీపీ పాలనకు , టీడీపీ పాలనకు తేడాలు వివరిస్తూ ఆ నేతలను ఓ ఆట ఆడుకుంది. మీరు ఇప్పటి వరకు చాలా ప్రభుత్వాలు చూశారు.. ఎప్పుడైనా ఇలాంటి పాలన చూశారా అంటూ టీడీపీ నేతలను ప్రశ్నించింది ఆ మహిళ. 1 తేదీనే ఉదయం 7 గంటలకే పింఛన్లు తలుపు కొట్టి మరీ అందిస్తున్నారని ఆ మహిళ తెలిపింది. దీంతో టీడీపీ నేతలు సైలెంట్‌గా అక్కడ నుంచి జారుకున్నారు.

తాజాగా టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరికి నిరసన సెగ ఎదురైంది. రాజమండ్రి రూరర్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న టీడీపీ కూటమి అభ్యర్థి బుచ్చయ్య చౌదరి జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే బుచ్చయ్య చౌదరికి ఓ మహిళ షాకిచ్చింది. ఇన్నాళ్లు ఏం చేశారంటూ బుచ్చయ్య చౌదరిని సదరు మహిళ ప్రశ్నించడంతో ఆయన ఒక్కసారిగా ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు.మహిళను దుర్భాషలాడటంతో వివాదం చెలరేగింది. గ్రామంలోని వారంతా ఆయనపై రివర్స్ అయ్యారు. నన్ను చెప్పుతో కొడతావా అంటూ బుచ్చయ్య చౌదరిపై మహిళ మండిపడింది. దీంతో అక్కడున్న కార్యకర్తలు బుచ్చయ్య చౌదరిని పక్కకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. మరో చోట బుచ్చయ్య చౌదరిని ఏం చేశావంటూ నిలదీశారు స్థానికులు.












Click it and Unblock the Notifications