అమ్మకానికి శిశువు: పెళ్లి కాకుండానే తల్లైన యువతి

అమరావతి: తూర్పుగోదావరి జిల్లాలో దారుణం జరిగింది. ఈ గన్నవరం మండలం ఏనుగుపల్లికి చెందిన ఓ యువతి పెళ్లి కాకుండానే గర్భం దాల్చింది. దీంతో అమలాపురం ఆసుపత్రిలో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. పెళ్లి కాకుండానే బిడ్డకు జన్మనివ్వడంతో సమాజానికి భయపడిన ఆ యువతి తన బిడ్డను అమ్మకానికి పెట్టింది.

అమ్మకానికి పెట్టిన బిడ్డను అదే వార్డులో ఉన్న మరో మహిళ మంగ ఆ బిడ్డను కొనేందుకు సిద్ధమైంది. బిడ్డను ఇస్తే రూ. 10 వేలు ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. కొంత డబ్బు ముందస్తుగా ఇచ్చింది. ఆదివారం ఉదయం ఆ బిడ్డను తీసుకెళ్లడానికి వచ్చిన మంగకు చేదు అనుభవం ఎదురైంది.

women got pregnant before marriage

మగబిడ్డను ఇచ్చేందుకు ఆమె నిరాకరించడంతో మంగ తన బంధువులను తీసుకొచ్చి గొడవకు దిగింది. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు నిందితురాలిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

డెంగీతో యువకుడు మృతి

అనంతపురం జిల్లాలో డెంగీతో ఓ యువకుడు మృతిచెందాడు. ఓడిచెరువు మండలం కొండకమర్ల నాయనికోటకు చెందిన కె. ప్రసాద్ అనే యువకుడు డెంగీ లక్షణాలతో కదిరిలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. అయితే యువకుడి మృతికి ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ అతని బంధువులు ఆందోళన చేపట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+