లేడీ జర్నలిస్టుల అరెస్టు, కెటిఆర్‌కు సెగ (పిక్చర్స్)

హైదరాబాద్: తెలంగాణలో ఎబిఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ9 ప్రసారాల నిలిపివేతపై మహిళా జర్నలిస్టులు మంగళవారంనాడు ముఖ్యమంత్రి కార్యాలయం వద్ద నిరసనకు దిగా, ఐటి శాఖ మంత్రి కెటి రామారావుకు నిరసన సెగ తగిలింగి. మహిళా జర్నలిస్టులను పోలీసులు అరెస్టు చేశారు.

మహిళా జర్నలిస్టులు మంగళవారం సాయంత్రం హెచ్‌ఆర్‌సిని కలిసి ఉదయం తెలంగాణ ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం వద్ద తమపై పోలీసులు ప్రవర్తించిన తీరుపై ఫిర్యాదు చేశారు. గత మూడు నెలలుగా ఏబిఎన్‌ ఆంధ్రజ్యోతి, టీవీ 9 చానళ్ల ప్రసారాలను నిలిపివేయడం పట్ల నిరసనగా ముఖ్యమంత్రి కార్యాలయం వద్ద మౌన ప్రదర్శన చేస్తుంటే పోలీసులు నిర్దాక్షిణ్యంగా వ్యవహరించారని వారు హెచ్‌ఆర్‌సి దృష్టికి తీసుకువెళ్లారు. జరిగిన సంఘటనపై ఈ నెల 16 వ తేదీలోగా నివేదిక ఇవ్వాలని సీపీని హెచ్‌ఆప్‌సి ఆదేశించింది.

మంగళవారం ఉదయం జరిగిన సంఘటనలో పోలీసులు తాళ్ల సాయంతో మహిళలను ఈడ్చేశారని, మహిళా జర్నలిస్టులు మౌన ప్రదర్శన చేస్తుంటే కనీసం మహిళా కానిస్టేబుళ్లను గాక, పురుషులనే వినియోగించారని వారు ఫిర్యాదు చేశారు. కొంతమంది మహిళా జర్నలిస్టులను పోలీసులూ కాళ్లూ, చేతులూ పట్టుకుని లాగేశారని, ఈ హఠాత్పరిణామానికి కొందరు దిభ్రాంతికి గురయ్యారని వారు హెచ్‌ ఆర్‌ సి దృష్టికి తీసుకువెళ్లారు.

మహిళా జర్నలిస్టుల నిరసన

మహిళా జర్నలిస్టుల నిరసన

ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి, టీవీ-9 చానళ్ల ప్రసారాలను తెలంగాణలో నిషేధించడంపై నిరసన వ్యక్తం చేస్తూ మంగళవారం మహిళా జర్నలిస్టులు మౌన ప్రదర్శన నిర్వహించారు. నోటికి నల్ల రిబ్బన్‌ కట్టుకుని నిరసన వ్యక్తం చేశారు.

మహిళా జర్నలిస్టుల అరెస్టు

మహిళా జర్నలిస్టుల అరెస్టు

తక్షణమే రెండు టీవీ చానళ్ల ప్రసారాలనూ పునరుద్ధరించాలని వారు డిమాండ్‌ చేశారు. అనంతరం పోలీసులు జర్నలిస్టులను అరెస్టు చేసి గోషామహల్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.

మహిళా జర్నలిస్టుల మండిపాటు

మహిళా జర్నలిస్టుల మండిపాటు

గర్భిణి అని కూడా చూడకుండా ఒక మహిళా జర్నలిస్టును కూడా పోలీసులు అరెస్టు చేశారనే ఆరోపణలు వచ్చాయి. కనీసం నిరసన తెలిపే అవకాశం కూడా ఇవ్వడంలేదని జర్నలిస్టులు ఆవేదన వ్యక్తం చేశారు.

కెటిఆర్‌కు జర్నలిస్టుల సెగ

కెటిఆర్‌కు జర్నలిస్టుల సెగ

టీవీ చానెళ్ల ప్రసారాల నిలిపివేతపై తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కెటి రామారావుకు జర్నలిస్టుల నిరసన సెగ తగిలింది.

నల్లరిబ్బన్లతో జర్నలిస్టుల నిరసన

నల్లరిబ్బన్లతో జర్నలిస్టుల నిరసన

తెలంగాణ 100 రోజుల పాలనపై కెటిఆర్ మంగళవారం పర్యాటక భవన్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి, టీవీ-9 ప్రసారాల నిషేధంపై నోటికి నల్ల రిబ్బన్లు కట్టుకుని జర్నలిస్టులు నిరసన వ్యక్తం చేశారు.

వైఫై నగరంగా రూపొందిస్తాం

వైఫై నగరంగా రూపొందిస్తాం

హైదరాబాదును వైఫై నగరంగా రూపొందిస్తామని కెటి రామారావు చెప్పారు. ఐటి రంగంలో హైదరాబాదును అగ్రగామిగా నిలుపుతామని ఆయన చెప్పారు.

ఎలక్ట్రానికి ఉపకరణాల తయారీ

ఎలక్ట్రానికి ఉపకరణాల తయారీ

తెలంగాణలో ఎలక్ట్రానికి ఉపకరణాల తయారీ పరిశ్రమను ఏర్పాటు చేయనున్నట్లు ఐటి శాఖ మంత్రి కెటి రామారావు వెల్లడించారు.

పారిశ్రామికాభివృద్ధి

పారిశ్రామికాభివృద్ధి

తెలంగాణలో శరవేగంగా పారిశ్రామికాభివృద్ధి జరుగుతుందని, వచ్చే ఐదేళ్లలో తెలంగాణ అద్భుత రాష్ట్రంగా అవతరిస్తుందని కెటి రామరావు చెప్పారు.

ఒప్పంద కార్యక్రమంలో..

ఒప్పంద కార్యక్రమంలో..

బేగంపేటలోని హరిత ప్లాజాలో జరిగిన ఐటి ఇ అండ్ సి ఒప్పందం కార్యక్రమానికి కెటిఆర్ హాజరయ్యారు. తెరాస వంద రోజుల సందర్భంగా ఈ ఒప్పందం జరిగింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+