పది హత్యలు: అతను ఏడుగురిని, ఆమె ముగ్గుర్ని
మహబూబ్‌నగర్: జిల్లాలోని పది మంది మహిళల హత్య కేసులను పోలీసులు ఛేదించారు. ఏడుగురు మహిళలను హత్య చేసిన ఓ పురుషుడిని, ముగ్గురు మహిళలను హత్య చేసిన మరో మహిళను పోలీసులు అరెస్టు చేశారు. ఇరవై రెండేళ్ళ వయసు కూడా నిండని వడ్డె రాజు అనే వ్యక్తి ఏడుగురు మహిళలను హత్య చేశాడు, మరొకరిపై హత్యాయత్నం చేశాడు. ఒక హత్య కేసు పరిశోధనలో ఉంది.
కాళ్ళకు కడియాలున్న ఒంటరి మహిళలే అతడి లక్ష్యం చేసుకుని నిర్జన ప్రదేశాలకు తీసుకెళ్ళి అత్యాచారానికి పాల్పడి, అనంతరం హత్య చేయడం, కడియాలను దొంగిలించడం అతడి పని. ఫోన్ కాల్ ఆధారంగా ఆ కిరాతకుడు పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యాడు. జిల్లా కేంద్రానికి చెందిన మరో కిలాడీ లేడీ కూడా పోలీసులకు చిక్కింది. ఆమె ముగ్గురు మహిళలను హత్య చేసి కడియాలను అపహరించింది. ఆమెను కూడా పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించారు.
మహబూబ్‌నగర్ మండలం కోడూర్ గ్రా మానికి చెందిన వడ్డెరాజు బతుకుదెరువు కోసం హైదరాబాద్‌కు వలస వెళ్ళి, అక్కడ సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేశాడు. తానుంటున్న గుడిసె పక్కనే నివసించే పద్మ అనే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఆమెను తీసుకుని జిల్లా కేంద్రానికి వచ్చి, టీడీ గుట్ట వద్ద నివసిస్తున్నాడు. తన అన్నకు చెందిన ఆటోను నడుపుతూ జీవనం సాగించాడు.

ఆర్థిక ఇబ్బందు ల ఎక్కువవడంతో దొంగతనాలకు మరిగాడు. అందుకోసం హత్యలకు తెగించాడు. మార్చి మూడున హన్వాడ మండలం వేపూర్ గ్రామానికి చెందిన దంత పల్లి నర్సమ్మ అశోక్ థియేటర్ వద్ద ఒంటరిగా కన్పించడంతో, వడ్డెరాజు ఆమెతో మాటలు కలిపాడు. తన వెంట వస్తే డబ్బులిస్తానని ఆశ చూపాడు. ఇద్దరూ కలిసి జీపులో కోడూరు శివారుకు వెళ్ళారు. మద్యం తాగారు. నర్సమ్మ మత్తులోకి జారాక బండరాయితో ఆమె తలపై మోది చం పేశాడు. అనంతరం కాళ్ల కడియాలు అపహరించాడు.
ఇదే రకంగా హత్యలు చేసి, వెండి కడియాలను అపహరించాలని నిర్ణయించుకున్నాడు. అప్పటి నుంచి నెలకు ఇద్దరు మహిళల చొప్పున హత్య చేస్తూ, కడియాలను దొంగిలించడం మొదలు పెట్టాడు. ఇలా నాలుగు నెలల్లో, ఏడుగురు మహిళలను దారుణంగా హత్య చేశాడు. మరో మహిళను కూడా ఇదే తరహా లో హత్య చేసేందుకు యత్నించాడు. హన్వాడ మండలం కొనగట్టుపల్లికి చెందిన మహిళను జ మిస్తాపూర్ శివారుకు తీసుకెళ్ళి, తలపై రాయి తో మోదడంతో ఆమె అపస్మారక స్థితిలో పడిపోయింది.
చనిపోయిందని భావించిన వడ్డెరాజు ఆమె కడియాలతో పాటు, పట్టీలు తీసుకొని వెళ్ళిపోయాడు.తీవ్రంగా గాయపడిన ఆమె ప్రాణాలతో బయటపడింది. ఆమెకు నిందితుడెవరో తెలిసినా, ఇంట్లో గొడవలవుతాయని భావించి పోలీసులకు పూర్తి వివరాలు చెప్పలేదు.
ముగ్గురిని హత్య చేసిన కిలాడీ లేడీ
జిల్లా కేంద్రానికి చెందిన ఒక మహిళ ముగ్గురు మహిళలను దారుణంగా హత్య చేసింది. అనంతరం వారి కాళ్లను బండరాయితో చితక్కొ ట్టి కడియాలు అపహరించింది. జిల్లా కేంద్రంలోని జగ్జీవన్‌రాంనగర్‌కు చెందిన మంగ లక్ష్మ మ్మ ఈ దారుణాలకు ఒడిగట్టింది. కల్లు దుకాణాల వద్దకు ఒంటరిగా వచ్చే మహిళలతో స్నేహం చేసి, తనకు తెలిసిన వ్యక్తితో వ్యభిచారం చేస్తే ఎక్కువ డబ్బులిప్పిస్తానని చెప్పి రాత్రివేళ నిర్జన ప్రదేశాలకు తీసుకె ళ్లేది. అక్కడ వారిని హత్యచేసి కాళ్ళు నరికి కడియాలు దొంగిలించేది.
జిల్లా కేంద్రంలోని రాజేంద్రనగర్‌లో నిర్మాణంలో ఉన్న అపార్ట్‌మెంట్‌లో దొడ్డలోని పల్లికి చెందిన లక్ష్మమ్మను హత్య చేసి, కాళ్ళు నరికి నగలు అపహరించింది. ఇదే తరహాలో మరో ఇద్దరిని కూడా చంపి, కడియాలు ఎత్తుకెళ్లింది. ఈ కేసును కూడా సెల్ ఫోన్ కాల్స్ ఆధారంగానే పోలీసులు ఛేదించారు. నిందితుల నుంచి 320 తులాల వెండి నగలు, మోటార్‌సైకిల్, ఆటోను స్వాధీనం చేసుకున్నారు.












Click it and Unblock the Notifications