జాతీయ పార్టీగా టీడీపీ:బాబు, బిజీగా బాలయ్య

విజయవాడ: మహిళలను అభివృద్ధిలో భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం డ్వాక్రా సంఘాలు ప్రవేశపెట్టిందని సీఎం, తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. విజయవాడలో ఏర్పాటు చేసిన తెలుగుదేశం విస్తృత స్ధాయి సమావేశంలో చంద్రబాబు ముఖ్య అతిధిగా పాల్గొని ప్రసంగించారు.

పెన్షన్లను ఐదు రెట్లు పెంచామన్న ఆయన అర్హులందరికీ పెన్షన్లు అందేలా చేస్తామన్నారు. వృద్దాప్య, వితంతు, వికలాంగ ఫించన్లపై గ్రామ స్ధాయిలో ఆరుగురితో కమిటీ వేశామని దీంతో అర్హులకే పింఛన్లు మంజూరయ్యారని అన్నారు. కాంగ్రెస్ హయాంలో 40, 50 ఎకరాలు ఉన్నవారు కూడా ఫించన్లు తీసుకున్నారని అన్నారు.

Women will play akey role in Development: AP Cm Chandrababu Naidu

ఇక నుంచి పించన్లు తీసుకునే వారి వివరాలను ఆన్ లైన్‌లో చూసుకోవచ్చని ఆయన అన్నారు. కాంగ్రెస్ పాలనలో డ్వాక్రా సంఘాలను నిర్వీర్యం చేశారన్నారు. డ్వాక్రా సంఘాల్లో ప్రభుత్వ పెత్తనం ఉండదని స్పష్టం చేశారు. కొందరు స్వార్ధంతో తెలుగుదేశం పార్టీని వీడుతున్నా కార్యకర్తల పార్టీతోనే ఉన్నారన్నారు.

తెలుగుదేశం పార్టీకి జాతీయ పార్టీగా ఎదిగే సత్తా ఉందని జోస్యం చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనపై తనది రెండు కళ్ల సిద్ధాంతమంటూ అందరూ తనన్ని విమర్శించారని.. కానీ ప్రజలు ఆశీర్వదించారని అన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో తమ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు మరో ఆరు నెలల సమయం పడుతుందన్నారు.

తెలంగాణలో టీడీపీని దెబ్బతీసేందుకు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎవరెన్ని కుట్రలు చేసినా తెలుగుదేశం పార్టీని ఏమీ చేయలేరని అన్నారు. సమన్యాయం అంటే ఏమిటని కొందరు ప్రశ్నించారని, అభివృద్ధే అన్ని ప్రశ్నలకు సమాధానమని చంద్రబాబు చెప్పారు. పదేళ్ల కాంగ్రెస్ పాలనలో విద్యుత్ వ్యవస్ధను కుప్పకూల్చారని విమర్శించారు.

ఉత్తరాంధ్ర జిల్లాలను అతలాకుతం చేసిన హుదూద్ తుపానును సమర్ధవంతంగా ఎదుర్కున్నామని చెప్పారు. రైతాంగం సమస్యల్లో ఉందన్న చంద్ర బాబు రైతుల ఖర్చులను తగ్గించి, ఆదాయాన్ని భారీగా పెంచనున్నామని తెలిపారు. అక్రమంగా ఎర్రచందనం రవాణా చేస్తున్న వారిని వదిలిపెట్టేది లేదని చంద్రబాబు స్పష్టం చేశారు.

ఈ సమావేశంలో సీనియర్ నేతలు యనమల రామకృష్ణుడు, కాల్వ శ్రీనివాసులు, అయ్యన పాత్రుడు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, శిద్దా రాఘవరావు, కళా వెంకట్రావు, హిందూపురం ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణ, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సమావేశానికి హాజరయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+