హైదరాబాద్‌పై అసద్ మళ్లీ, దమ్ముంటే రావాలని మోడీకి

హైదరాబాదు శాంతిభద్రతలు గవర్నర్ చేతిలో పెట్టాలనుకోవడం విడ్డూరమన్నారు. బిజెపిని ఎదుర్కొనే శక్తి కాంగ్రెసు కోల్పోయిందన్నారు. లౌకికవాదాన్ని నమ్మి తాము ఇన్నాళ్లు కాంగ్రెసు పార్టీకి మద్దతిచ్చామన్నారు. 2014 ఎన్నికల్లో బిజెపిని అధికారంలోకి రానిచ్చేది లేదని, ఆర్ఎస్ఎస్ సంఘ్ పరివార్, బిజెపి దేశంలో సెక్యులరిజాన్ని ఖతం చేస్తున్నాయని విమర్శించారు. 2014 ఎన్నికల్లో బిజెపి అధికారంలోకి రావాలని చూస్తుందని దేశ ప్రజలపై తమకు నమ్మకం ఉందని బిజెపిని అధికారంలోకిరానివ్వరని ఆయన అన్నారు.
బిజెపి ఎన్నికల వేళ సర్ధార్ వల్లభాయ్ పటేల్‌ను తెరపైకి తెచ్చి హీరోగా చేస్తుందని దేశ భధ్రతకు ముప్పు పొంచి ఉందని సెక్యూలరిజాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని ఆయన అన్నారు. పటేల్ కరుడుగట్టిన హిందుత్వ వాది అన్నారు. మాయావతి, ఉత్తర్‌ప్రదేశ్‌లో అంబేద్కర్, కాన్షీరాంలాంటి దళిత నేతల విగ్రహాలు పెడితే ఆర్ఎస్ఎస్ హిందువాదులైన వల్లభాయ్ పటేల్ విగ్రహం ఏర్పాటుకు శ్రీకారం చుట్టిందన్నారు.
కాంగ్రెస్‌లో దమ్ములేకనే నాలుగు రాష్ట్రాల్లో బిజెపి గెలిచిందని విమర్శించారు. మజ్లిస్‌పార్టీలో దమ్ముందని బిజెపిని అధికారంలోకి రానివ్వమన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో బిజెపిలో ఒక్కపార్లమెంట్ స్థానంలో కూడా గెలునివ్వమని సవాల్ విసిరారు. ఆర్ఎస్ఎస్‌కు దమ్ముంటే హైదరాబాద్‌కు వచ్చి మజ్లిస్‌ను ఢీకొనాలని ఛాలెంజ్ చేశారు. కాంగ్రెస్‌లో మతిలేని నేతలు ఎక్కువయ్యారన్నారు. జాతిపిత పేరును పలుకడం రాని మోడీ ప్రధాని ఎలా అవుతారని ఎద్దేవా చేశారు.
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినట్లు కలలు కంటున్నారని ఆయన ముఖ్యమంత్రి కాలేరని అన్నారు. మోడీతో బాబు చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్నారని మండిపడ్డారు. మధ్యప్రదేశ్‌కు వెళ్లి చంద్రబాబు బిజెపినేతలను కలవడంపై మండిపడ్డారు. మోడీకి దమ్ముంటే హైదరాబాదులో తమతో పోటీకి రావాలని సవాల్ విసిరారు.












Click it and Unblock the Notifications