వైసీపీ కార్యకర్తల్లా పోలీసులు-అధికారంలో వచ్చాక ఎవర్నీ వదలను-చంద్రబాబు వార్నింగ్

ఏపీలో వైసీపీ వర్సెస్ టీడీపీగా సాగుతున్న పొలిటికల్ పార్ లో నిన్న చిత్తూరు ఘటన తీవ్ర కలకలం రేపింది. చిత్తూరు మేయర్ దంపతుల హత్య కేసులో పోలీసులు విచారణ పేరుతో టీడీపీ నేతల్ని వేధించడం, అడ్డుకున్న టీడీపీ మాజీ మేయర్ కాలిపైకి జీపు పోనివ్వడంతో ఈ వ్యవహారం ముదురుతోంది. పోలీసుల తీరుపై టీడీపీ అదినేత చంద్రబాబు ఇవాళ తీవ్రంగా విరుచుకుపడ్డారు. తాను అధికారంలోకి వస్తే ఎవర్నీ వదలనంటూ హెచ్చరించారు.

చిత్తూరులో పోలీసుల తీరు

చిత్తుూరులో మేయర్ కఠారి అనురాధ, మోహన్ దంపతుల హత్య కేసులో విచారణ పేరుతో పోలీసులు హంగామా చేశారు. వారి కోడలు, టీడీపీకి చెందిన మాజీ మేయర్ హేమలతను టార్గెట్ చేశారు. హేమలత అనుచరుడైన పూర్ణ ఇంటిలో గంజాయి కలిగి ఉన్నారంటూ అర్ధరాత్రి సోదాలు నిర్వహించిన చిత్తూరు పోలీసులు.. అక్కడేమీ దొరకలేదు. దీంతో పూర్ణ ఆందోళనకు దిగారు. ఈ సమయంలో కఠారి హేమలత అక్కడికి వచ్చారు. పూర్ణను అరెస్టు చేసి తీసుకెళ్తుండగా పోలీసుల్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు ఆమె కాలిపైకి జీపును నడిపారు. గాయపడ్డ హేమలతను టీడీపీ కార్యకర్తలు ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన ఇప్పుడు చిత్తూరులో తీవ్ర కలకలం రేపుతోంది.

పోలీసులపై చంద్రబాబు ఫైర్


నిన్న చిత్తూరులో మాజీ మేయర్ హేమలతపై పోలీసుల దాడిపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. ఈ మేరకు వరుస ట్వీట్లు చేశారు. వైసీపీ కార్యకర్తల్లా మారి గాడి తప్పిన పోలీసు అధికారులను వదిలేది లేదంటూ ట్విట్టర్ లో హెచ్చరించారు. జగన్ రెడ్డి దయాదాక్షిణ్యాల కోసం కొందరు పోలీసులు ఇంతలా దిగజారి పోయారంటే ఆశ్చర్యంగా ఉందన్నారు. చిత్తూరులోమేయర్ దంపతుల హత్య కేసులో సాక్షులను వేధించి, అక్రమ కేసులు పెట్టడంలోఅర్థం ఏమిటని ప్రశ్నించారు. నేరస్తులను కాపాడుతున్నారా అని నిలదీశారు. పోలీసులేపూర్ణ ఇంట్లో గంజాయి బస్తా పెట్టి కేసులు రాయడం దుర్మార్గమన్నారు.

 ఎవర్నీ వదిలిపెట్టబోమన్న చంద్రబాబు

ఎవర్నీ వదిలిపెట్టబోమన్న చంద్రబాబు

పోలీసులు చేస్తున్న దౌర్జన్యాన్ని అడ్డుకోడానికి వచ్చిన చిత్తూరు మాజీ మేయర్కఠారి హేమలత మీదికి, మహిళ అని కూడా చూడకుండా పోలీసు జీపు ఎక్కించడానికి ఎంత ధైర్యమని ట్వీట్ లో చంద్రబాబు ప్రశ్నించారు. ఎవరి అండ చూసుకుని ఇలా రాక్షసంగా రెచ్చిపోతున్నారని అడిగారు. ప్రభుత్వం చేయించిన ఈ దౌర్జన్యకాండనుతీవ్రంగా ఖండిస్తున్నానని చంద్రబాబు ట్విట్టర్ లో పేర్కొన్నారు. వైసీపీ కార్యకర్తల్లా మారి తప్పులు చేస్తున్న పోలీసులనువదిలే ప్రసక్తి లేదన్నారు. పార్టీ తరపున న్యాయపోరాటం చేస్తామన్నారు. రేపు మేము అధికారంలోకి వచ్చాక గాడి తప్పిన ప్రతి అధికారిపైచర్యలు తీసుకుంటామని చంద్రబాబు హెచ్చరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+