Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

టిలో కెసిఆర్ వ్యూహం: మజ్లిస్ అవసరం, రిజర్వ్‌లో జగన్

హైదరాబాద్: తెలంగాణలో గత నెల 30వ తేదీన పోలింగ్ జరిగింది. ఈ నెల 16వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి. ఫలితాల పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణలో తెరాస సంపూర్ణ మెజార్టీతో అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ నేతలు ఢంకా బజాయిస్తున్నారు. మరోవైపు కాంగ్రెసు పార్టీ కూడా అదే చెబుతోంది. టిడిపి, బిజెపి కూటమి అధికారంలోకి వచ్చే స్థానాలను గెలుచుకోలేకపోయినా.. చాలా స్థానాల్లో విజయం సాధించే అవకాశముంది.

ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ... కావాల్సిన మెజార్టీ ఏ పార్టీకి వచ్చే అవకాశాలు అంతగా కనిపించడం లేదంటున్నారు. కాంగ్రెసు లేదా తెరాస ఎక్కువ స్థానాల్లో గెలిచే అవకాశముంది. అయితే మెజార్టీకి కావాల్సిన 60 స్థానాలకు ఆ పార్టీలు కొంత దూరంలో ఉండే అవకాశముందంటున్నారు. ఈ నేపథ్యంలో వారు మజ్లిస్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు. కాంగ్రెసు లేదా తెరాస.. ఏ పార్టీకి ఎక్కువ స్థానాలు వస్తే ఆ పార్టీకి తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు మజ్లిస్ మద్దతిచ్చే అవకాశముంది.

Wooed by all, Asaduddin Owaisi is amused

ఇప్పటికే కాంగ్రెసు లేదా తెరాసలకు మజ్లిస్ నుండి అనుమతి వచ్చినట్లుగా చెబుతున్నారు. ఈ రెండింట్లో ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశముంటే ఆ పార్టీకి మజ్లిస్ చేయూతనివ్వనుంది. మజ్లిస్ మద్దతు అవసరం పడవచ్చనే ఆలోచనతోనే కెసిఆర్ ఇటీవల ఎన్నికల్లో వ్యూహాత్మకంగా మాట్లాడారని అంటున్నారు. అంతకుముందు బిజెపితో పొత్తు కోసం ప్రయత్నించి విఫలమైన కెసిఆర్... ప్రచార సమయంలో మోడీ పైన నిప్పులు చెరిగారు.

తాము ఎట్టి పరిస్థితిల్లోను బిజెపితో పొత్తు పెట్టుకోమని చెప్పారు. అలాగే ఓ ప్రచార సభలో మాట్లాడుతూ... అసదుద్దీన్ ఓవైసీ మనవాడే అన్నారు. తద్వారా ఆయన తెలంగాణ ప్రాంతంలోని ముస్లింలను తమ వైపుకు మళ్లించుకునే ప్రయత్నాలు చేశారు. కాంగ్రెసు పార్టీ కూడా మజ్లిస్ పార్టీ అవసరం ఉండే అవకాశముందని భావిస్తోంది. మరోవైపు జగన్ పార్టీ అవసరం కూడా ఉంటుందా అనే చర్చ సాగుతోంది.

తెలంగాణలో జరిగిన ఓటింగ్ చూస్తే తెరాస ప్రభుత్వం ఖాయమని చెబుతున్నారు. అనుకోని విధంగా ఇతర పార్టీల అవసరం వస్తే... అనే ప్రశ్న మాత్రం అందర్నీ తొలుస్తోంది. ఈ నేపథ్యంలో మజ్లిస్ పార్టీ లాగా జగన్ పార్టీ అవసరం కూడా కొట్టి పారేయలేమంటున్నారు. పాతబస్తీలో మజ్లిస్ పార్టీ గట్టి పోటీని ఎదుర్కొంది. స్వయంగా అక్బరుద్దీన్ ఓవైసీకి చాంద్రాయణగుట్టలో ఎదురు గాలి వీచినట్లుగా ప్రచారం జరిగింది.

ఈ నేపథ్యంలో మజ్లిస్ పార్టీ తమకు కావాల్సినన్ని సీట్లు గెలుచుకోని పక్షంలో జగన్ పార్టీని కూడా రిజర్వ్‌లో ఉంచారని అంటున్నారు. విభజన నేపథ్యంలో జగన్ పార్టీ తెలంగాణలో ప్రాభవం కోల్పోయినప్పటికీ... నల్గొండ, హైదరాబాద్, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాల్లో మంచి పట్టు ఉంది. ఈ జిల్లాల్లో పలు స్థానాల్లో జగన్ పార్టీ గెలిచే అవకాశముందంటున్నారు. ఆ పార్టీ అవసరం కూడా ఎవరికైనా రావొచ్చని భావిస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+