ఫ్యామిలీతో లంచ్‌కెళ్లండి, లేదంటే మైండ్ పని చేయదు: ఉద్యోగులకు బాబు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనను తాను పని రాక్షసుడిని అని చెప్పుకుంటారు. చాలామంది కూడా దీంతో ఏకీభవిస్తారు. తాను రాష్ట్ర అభివృద్ధి కోసం రోజుకు పద్దెనిమిది గంటలు కష్టపడుతున్నానని చంద్రబాబు కూడా పలుమార్లు చెప్పారు.
అదే చంద్రబాబు ఈ మధ్య ఉద్యోగులకు ఫిలాసఫి చెప్పారు. మనిషి అన్నాక కాస్త వెసులుబాటు ఉండాలని, అలా ఉన్నప్పుడే చురుకుతనం, మంచి ఆలోచనలు వస్తాయని చంద్రబాబు చెప్పారు. ఇరవై నాలుగు గంటలు కార్యాలయంలో కూర్చుంటే నాలుగు గోడలే కనిపిస్తాయని, దీంతో మైండ్ కూడా పని చేయదని ఉద్యోగులతో చెప్పారు.

వారంలో ఒకరోజు కుటుంబంతో కలిసి బయటకు వెళ్లి భోజనం చేసి వస్తే ప్రెష్‌నెస్ వస్తుందని అభిప్రాయపడ్డారు. తన పెషీలోని ఉద్యోగులు ఈ రోజు భోజన విరామం వద్దని చెప్పారని, లంచ్ బ్రేక్ లేకపోతే మైండ్ బ్రేక్ అవుతుందని చెప్పానని చెప్పారు. గంట, రెండు గంటలు విరామం లేకుంటే మనిషి చురుగ్గా ఉండలేడన్నారు.












Click it and Unblock the Notifications