చెత్త రాజకీయాలు ..బెదిరిస్తే భయపడను : వైసీపీ నేతలకు బైరెడ్డి శబరి వార్నింగ్
ఏపీని కరోనా వైరస్ టెన్షన్ వెంటాడుతున్న సమయంలో కరోనాపై రాజకీయ వర్గాల వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి. ఏపీలో ఇప్పటికే మూడు పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇప్పటికే విద్యా సంస్థలు ,ఆలయాలు మూసివేసి కరోనా కంట్రోల్ కోసం చర్యలు తీసుకుంటున్న పరిస్థితి ఉంది. అయితే ముఖ్యమంత్రి వైఎస్ జగన్, మరో ఉన్నతాధికారి రమేష్ కరోనాకు పారాసిటామల్ అంటూ చేసిన వ్యాఖ్యలపై బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి కుమార్తె డాక్టర్ శబరి స్పందించటం ఆమెపై ట్రోల్స్ కు కారణంగా మారింది.

650 గ్రాముల పారాసిటమాల్ అంటూ జగన్ ను టార్గెట్ చేసిన బైరెడ్డి శబరి
పారాసిటమాల్‌తో కరోనా తగ్గతుందనే అర్ధం వచ్చేలా సీఎం జగన్ , అలాగే ఉన్నతాధికారి రమేష్ మాట్లాడటంపై డాక్టర్ గా స్పందించిన బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి కుమార్తె శబరి కరోనా బారిన పడకుండా సూచనలు చెయ్యటంతో పాటు ముఖ్యమంత్రి జగన్ , అలాగే రమేష్ చేసిన పారాసిటామల్ వ్యాఖ్యలపై స్పదించారు. 650 గ్రాముల పారాసిటమాల్ ఆరు గంటలకు ఒకసారి వేసుకోవాలా.. రోజుకు రెండున్నర కేజీల పారాసిటమాల్ వేసుకోమన్నారు. అది స్వీటా అలా తినడానికి అంటూ ఆమె సెటైర్లు వేశారు . పెద్ద పదవిలో ఉండి మాట్లాడటం సబబు కాదనేది తన ఉద్దేశం అన్న ఆమె వ్యాఖ్యలను వైసీపీ నేతలు సీరియస్ గా తీసుకున్నారు .

బైరెడ్డి శబరి వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో ట్రోల్స్
ఇదిలా ఉంటే మాజీ మంత్రి బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి కుమార్తె శబరి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తున్నారు. 650 గ్రాములంటే అరకేజీ కంటే ఎక్కువ . అంతేకాదు పెద్ద యాపిల్ అంత సైజు ఉండాలి . 650మిల్లీ గ్రాములు పారాసిటామల్ కు బదులు 650 గ్రాములంటే ఇక ఆమె వైద్యం గురించి ఆమెకే తెలియాలంటూ సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తున్నారు. కరోనాకు సంబంధించి బైరెడ్డి శబరి చేసిన వ్యాఖ్యలపై వైఎస్సార్‌సీపీ నేతల కౌంటర్‌తో రాజకీయం హీటెక్కింది. తాను ఓ డాక్టర్‌గా కరోనా బారిన పడకుండా ప్రజల కోసం కొన్ని సూచనలు చేశానని ఆ క్రమంలోనే ప్రస్తావించానని చెప్పిన శబరి బెదిరిస్తే భయపడేది లేదని చెప్పారు.

బెదిరిస్తున్నారని, కొడతామని చెప్తున్నారన్న శబరి
ముఖ్యమంత్రి జగన్ కరోనాకు పారాసిటమాల్ తో ట్రీట్మెంట్ చెయ్యొచ్చు అన్నారని కానీ పారాసిటమాల్‌తో జ్వరం మాత్రమే తగ్గుతుంది అన్నారు. కరోనా ఇన్‌ఫెక్షన్ తగ్గదని దానికి వేరే ట్రీట్మెంట్ ఉందని మాత్రమే ఆ వీడియోలో చెప్పానని ఆమె పేర్కొన్నారు . అయితే తప్పు మాట్లాడితే ప్రశ్నించకూడదని ఏమైనా ఉందా అని వ్యాఖ్యానించిన శబరి తనను కొంతమంది ఫోన్‌కాల్స్, మెసేజ్‌లు పెట్టి బెదిరిస్తున్నారన్నారు. బయటకు వస్తే కొడతామని చెప్తున్నారని, మీ సంగతి చూస్తాం, చెప్పులతో కొట్టిస్తామంటున్నారని వ్యాఖ్యానించారు.
Recommended Video

వైసీపీ నేతల ఇళ్ళలో ఆడవాళ్ళు లేరా ? భయపడను అంటూ ఫైర్
ఇక మహిళ అని కూడా చూడకుండా ఇంత అసభ్యంగా మాట్లాడుతున్న వారు మీ వైఎస్సార్‌సీపీ నేతల ఇళ్లలో మహిళలు ఉన్న సంగతి మర్చిపోయారా అంటూ మండిపడ్డారు. వాళ్ల ఇళ్ళలో కూడా భార్య, అక్కాచెల్లెళ్లు ఉన్నారని గుర్తు పెట్టుకోవాలని ఈ తరహా ట్రోల్స్ మంచిది కాదని ఆమె హితవు పలికారు . ఇక వైసీపీ నేతలను ఉద్దేశించి పార్టీలో క్రమశిక్షణ చాలా ముఖ్యం అన్నారు. కొంతమంది రౌడీలకు పెత్తనం ఇస్తే ఇలానే ఉంటుందని మండిపడిన శబరి మంచి చెబుతుంటే తప్పంటారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు . ఇక ఈ చెత్త రాజకీయాలకు భయపడను అని ఆమె పేర్కొన్నారు.
-
ఎక్కడ కొట్టాలో అక్కడ దెబ్బకొడుతున్న డొనాల్డ్ ట్రంప్..: ఫస్ట్ ట్రిగ్గర్ -
అమెరికా- ఇరాన్ చర్చలు విఫలం- ఇకపై మరింత..!! -
ఇరాన్ యుద్ధం వేళ భారత్-అమెరికా భారీ డీల్! -
ఆ ఇద్దరి రాకతో జాగ్రత్త పడ్డ ఇరాన్- అనుకున్నదంతా అయింది -
కిలో బియ్యం రూ.600 - రూ.800.. కేజీ మాంసం రూ. 4000 పైనే !!! -
అమెరికాలో ‘తెలుగు’ అందాలు: చిలకలూరిపేట చిన్నది Vs కరీంనగర్ క్వీన్ -
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!!












Click it and Unblock the Notifications