వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గుడివాడలో రోడ్ల దుస్థితి: వైసీపీ వర్సెస్ జనసేన.. కొడాలి నాని ఇంటి దగ్గర రచ్చ!!

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోడ్ల దుస్థితిపై గుడ్ మార్నింగ్ సీఎం సార్ అంటూ పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన డిజిటల్ యుద్ధం కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. నేటితో సీఎం జగన్మోహన్ రెడ్డి రోడ్లను మరమ్మత్తులు చేయడానికి విధించిన డెడ్లైన్ ముగియడంతో రాష్ట్రంలో రోడ్ల అధ్వాన్నమైన పరిస్థితిని తెలియజేస్తూ వీడియోలను, ఫోటోలను పోస్ట్ చేస్తూ జనసేన నాయకులు సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. ఇక ప్రజలను కూడా దీంట్లో భాగస్వామ్యం తీసుకోవాలని జనసేన విజ్ఞప్తి చేయడంతో, వివిధ నియోజకవర్గాల్లో ప్రజలు సైతం తమ నియోజకవర్గాలలోని రోడ్ల దుస్థితి కళ్ళకు కట్టినట్టు చూపే ప్రయత్నం చేస్తున్నారు.

కొడాలి నాని ఇల్లు ముట్టడికి ప్రయత్నించిన జనసేన

ఈ క్రమంలోనే తాజాగా కృష్ణాజిల్లా గుడివాడలో మాజీ మంత్రి కొడాలి నాని గుడివాడలో రోడ్లను బాగు చేయించలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఇప్పటికైనా మరమ్మత్తులు చేయించాలని డిమాండ్ చేస్తూ కొడాలి నాని ఇంటిని ముట్టడించడానికి జనసేన పార్టీ శ్రేణులు ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో వైసీపీ శ్రేణులు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు . దీంతో గుడివాడలోని మాజీ మంత్రి కొడాలి నాని ఇంటి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. జనసేన నేతలను పోలీసులు అడ్డుకోవడంతో ఇరువురి మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది.

కొడాలి నాని ఇంటికి వెళ్ళే రోడ్డుపై ధర్నా చేసిన జనసేన నాయకులు

దీంతో జనసేన నాయకులను పోలీసులు అరెస్టు చేయడానికి ప్రయత్నం చేయగా, అసలు తాము చేసిన తప్పు ఏంటో చెప్పాలంటూ పోలీసులను నిలదీశారు జనసేన నాయకులు. దీంతో భారీగా మోహరించిన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఈ క్రమంలో గోతుల మయంగా ఉన్న కొడాలి నాని ఇంటికి వెళ్లే ప్రధాన రహదారిలోనే రోడ్డుపై బైఠాయించిన జనసేన పార్టీ నేతలు ధర్నా నిర్వహించారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో రోడ్ల దుస్థితి ఈ విధంగా ఉంటే మొద్దు నిద్ర పోతున్నారని, ఇప్పటికైనా ఆయన మేల్కోవాలి అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. నినాదాలు చేస్తూ తమ నిరసన వ్యక్తం చేశారు.

పవన్ కళ్యాణ్ కి కొడాలి నాని రాజకీయాలు నేర్పించటం మాని రోడ్లు బాగు చెయ్యాలని హితవు


ఇక కొడాలి నానిని సైతం టార్గెట్ చేసిన జనసేన పార్టీ నాయకులు బూతులు శాఖ మాజీ మంత్రి కొడాలి నాని నియోజకవర్గం గుడివాడలోని రోడ్ల దుస్థితి ఇదీ అని మండిపడ్డారు. మూడు సార్లుగా ఎమ్మెల్యేగా ఉంటూ కూడా గుడివాడకి చేసింది ఏమీ లేదని, కనీసం కొడాలి నాని సొంత ఇంటి వెళ్ళే రోడ్ కూడా బాగా చేసుకోలేకపోయాడు అంటూ విమర్శించారు.జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి కొడాలి నాని రాజకీయాలు నేర్పించటం మాని అద్వానంగా ఉన్న గుడివాడ రోడ్లకు మరమ్మత్తులు చేయించాలని జనసేన కార్యకర్తలు సూచించారు.

 గుడ్ మార్నింగ్ సీఎం సార్.. సోషల్ మీడియాలో రచ్చ గా మారిన డిజిటల్ వార్

గుడ్ మార్నింగ్ సీఎం సార్.. సోషల్ మీడియాలో రచ్చ గా మారిన డిజిటల్ వార్

గుడ్ మార్నింగ్ సీఎం సార్ జనసేన పార్టీ నిర్వహిస్తున్న డిజిటల్ క్యాంపెయిన్ కు విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. సోషల్ మీడియాలో ఏపీ వ్యాప్తంగా అనేక జిల్లాలలో రోడ్ల దుస్థితి పై ప్రజలు వినూత్నంగా ఆందోళనలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇక జనసేన నేతలు సీఎం జగన్ పాలనలో రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా ఉందని జగన్ ను టార్గెట్ చేస్తున్నారు. వందల సంఖ్యలో పోస్టులు పెడుతూ రచ్చ చేస్తున్నారు.

English summary
The Jana Sena tried to siege Kodali Nani's house over the condition of the roads in Gudivada and were stopped by the police. With this, tension continued near Kodali Nani's house.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X