జగన్‌పై సీఈసీకి ఫిర్యాదు: నంద్యాల ఉపఎన్నికపై హైకోర్టులో పిటిషన్
కర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నికల్లో అధికార పార్టీ దుర్వినియోగానికి పాల్పడుతోందని హైకోర్టులో సోమవారం రిట్ పిటిషన్ దాఖలైంది. కిరణ్ బాబు అనే వ్యక్తి వేసిన పిటిషన్‌ను ఉన్నత న్యాయస్థానం విచారణకు స్వీకరించ
ఢిల్లీ/హైదరాబాద్: కర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నికల్లో అధికార పార్టీ దుర్వినియోగానికి పాల్పడుతోందని హైకోర్టులో సోమవారం రిట్ పిటిషన్ దాఖలైంది. కిరణ్ బాబు అనే వ్యక్తి వేసిన పిటిషన్‌ను ఉన్నత న్యాయస్థానం విచారణకు స్వీకరించింది.
ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించి అధికార పార్టీ ప్రచారం నిర్వహిస్తోందని పిటిషనర్ ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను ప్రలోభానికి గురిచేస్తోందని తెలిపారు. అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు.

జగన్‌పై ఈసీకి ఫిర్యాదు
ఢిల్లీ: నంద్యాల ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా ఏపీ సీఎం చంద్రబాబుపై ప్రతిపక్ష నేత వైయస్ జగన్‌మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీ కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. ఆ పార్టీ ఎంపీలు రామ్మోహన్‌నాయుడు, నిమ్మల కిష్టప్ప, శ్రీరామ్ మాల్యాద్రి సీఈసీని కలిసి ఫిర్యాదు అందజేశారు.
ఈ సందర్భంగా ఎంపీలు రామ్మోహన్‌నాయుడు, నిమ్మల కిష్టప్ప మీడియాతో మాట్లాడారు. సీఎంను నడిరోడ్డుపై కాల్చి చంపాలని ప్రతిపక్ష నేత జగన్ వ్యాఖ్యానించడం, జడ్ కేటగిరీ ఉన్న వ్యక్తికి సంబంధించిన వాహనాన్ని అడ్డుకోవడంపై సీఈసీకి ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.
వైయస్సార్ కాంగ్రెస్ నేతలు చేసే ఫిర్యాదులపై ఈసీ అధికారులు తక్షణం స్పందించి చర్యలు తీసుకుంటున్నారని.. టీడీపీ చేసే ఫిర్యాదులను మాత్రం పట్టించుకోవడం లేదని సీఈసీకి దృష్టికి తీసుకెళ్లినట్లు ఎంపీలు వెల్లడించారు. అదేవిధంగా సాక్షి దినపత్రికలో వచ్చే పెయిడ్ న్యూస్‌ను ఎన్నికల ఖర్చుకిందే లెక్కగట్టాలని ఎన్నికల సంఘాన్ని కోరినట్లు తెలిపారు.
-
జగన్ బిగ్ ప్లాన్, 2019 కాంబో రిపీట్ - మారుతున్న లెక్కలు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!!












Click it and Unblock the Notifications