చిరంజీవి, పవన్‌లతో అధికార పార్టీలకే నష్టం: అయ్యన్నపంతులు

విశాఖపట్టణం: సినీ నటులు చిరంజీవి, పవన్ కళ్యాణ్‌లు పూర్తి స్థాయి రాజకీయాల్లోకి రావడం రావడం అధికార పార్టీలకే నష్టమని విశాఖ జిల్లా పెందుర్తికి చెందిన మహ కామేశ్వర పీఠాధిపతి యద్దనపూడి అయ్యన్న పంతులు చెప్పారు.

ఇప్పటికే చిరంజీవి, పవన్ కళ్యాణ్‌‌లు రాజకీయాల్లో ఉన్నారు. 2009 ఎన్నికల సమయంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఆ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు.

2014 ఎన్నికలకు ముందు సినీ నటుడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని ఏర్పాటు చేశారు. ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ జనసేన ద్వారా రాజకీయ కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నారు. ఏపీకి కేంద్రం నుండి నిధుల విషయంలో పవన్ కళ్యాణ్ పోరాట కార్యక్రమానికి ప్రస్తుతం శ్రీకారం చుట్టే పనిలో ఉన్నారు.

సినీ నటుల రాజకీయ ప్రవేశంపై విశాఖ జిల్లా పెందుర్తికి చెందిన మహా కామేశ్వర పీఠం అధిపతి యద్ధనపూడి అయ్యన్న పంతులు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మెగాస్టార్‌ చిరంజీవి, పవన్‌ కల్యాణ్‌లు రాజకీయ ప్రవేశం చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఆయన మాట్లాడుతూ.. చిరంజీవి , పవన్‌లు రాజకీయాల్లోకి రావడం అధికార పార్టీలకే నష్టమని అయ్యన్న పంతులు అన్నారు. సినిమా వాళ్లు రాజకీయాల్లోకి వస్తే మరో పార్టీ అధికారంలోకి వస్తుందని ఆయన జోస్యం చెప్పారు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలకు కాలసర్ప దోషం ఉందని ఆయన పేర్కొన్నారు.

పవన్, చిరులపై అయ్యన్నపంతులు ఆసక్తికర వ్యాఖ్యలు

పవన్, చిరులపై అయ్యన్నపంతులు ఆసక్తికర వ్యాఖ్యలు

పవన్ కళ్యాణ్, చిరంజీవి రాజకీయాల్లో పూర్తిస్థాయిలో రావడం అధికార పార్టీలకే నష్టమని విశాఖ జిల్లా పెందుర్తికి చెందిన మహ కామేశ్వర పీఠాధిపతి యద్దనపూడి అయ్యన్నపంతులు చెప్పారు. చిరంజీవి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. సినిమావాళ్ళు రాజకీయాల్లోకి వస్తే మరో పార్టీ అధికారంలోకి వస్తోందని అయ్యన్న పంతులు చెప్పారు.అయితే 2009 ఎన్నికల సమయంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని ఏర్పాటు చేశారు. అయితే 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రెండోసారి అధికారంలోకి వచ్చింది. పిఆర్‌పి చీల్సిన ఓట్ల కారణంగాన ఆనాడు టిడిపి ఓటమి పాలైందనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు కాల సర్ప దోషం ఉంది

ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు కాల సర్ప దోషం ఉంది

ఏపీ, తెలంగాణలకు కాల సర్ప దోషం ఉందని యద్ధనపూడి అయ్యన్న పంతులు వ్యాఖ్యానించారు.ఈ రెండు రాష్ట్రాలపై పంతులు చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి . ఏపీలో ప్రస్తుతం రాజకీయ వాతావరణం వేడెక్కింది.

2019లో రెండు రాష్ట్రాల్లో పోటీకి పవన్ సన్నద్దం

2019లో రెండు రాష్ట్రాల్లో పోటీకి పవన్ సన్నద్దం

2019 ఎన్నికల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో పోటీ చేసేందుకు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఏర్పాట్లు చేసుకొంటున్నారు. ఇప్పటికే రెండు రాష్ట్రాల్లో క్షేత్రస్తాయిలో సమస్యలను తీసుకొని వాటి పరిష్కారం కోసం పవన్ పనిచేస్తున్నారు. అంతేకాదు ఆయా నియోజకవర్గాల్లో పార్టీ క్యాడర్‌కు శిక్షణ ఇస్తున్నారు. రానున్న ఎన్నికల్లో ఏ స్థానాల్లో పోటీ చేయాలనే అంశంపై చర్చిస్తున్నారు.

పవన్ చుట్టూ రాజకీయం

పవన్ చుట్టూ రాజకీయం

2019 ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ ఏ రకమైన నిర్ణయం తీసుకొంటారనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం టిడిపి, బిజెపి, వైసీపీలకు పవన్ కళ్యాణ్ సమాన దూరాన్ని పాటిస్తున్నారు. ప్రత్యేక హోదా అంశంపై వైసీపీ అవిశ్వాస తీర్మానాన్ని పెడితే మద్దతిస్తానని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అయితే 2019 ఎన్నికల నాటికి పవన్ కళ్యాణ్ ఏ నిర్ణయం తీసుకొంటారోననే రాజకీయ పరిశీలకులు ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. టిడిపి, బిజెపిలకు వ్యతిరేకంగా ఇతర పార్టీలతో కలిసి పనిచేస్తారా, లేదా ఒంటరిగా పోటీ చేస్తారా అనేది క్లారిటీ రావాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+