బాధ్యత మీదే: నరసింహన్‌కు యనమల, గవర్నర్‌కు సెక్షన్8 చిక్కు

హైదరాబాద్: ఉభయ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ విభజన చట్టం ప్రకారం నడుచుకోవాలని ఏపీ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు అభిప్రాయపడ్డారు. సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఉమ్మడి రాజధాని పరిధిలో గవర్నర్ అధికారాల గురించి విభజన చట్టంలోని సెక్షన్ 8 స్పష్టంగా ఉందన్నారు.

దాని ప్రకారం గవర్నర్ చర్యలు తీసుకోవాలన్నారు. ఒకవేళ చట్టంలో ఏమైనా లోపాలు ఉంటే సరిదిద్దే బధ్యత, ఈ సెక్షన్‌ను అమలులోకి తెస్తూ నిబంధనలు జారీ చేయాల్సిందిగా కేంద్రాన్ని కోరాల్సిన బాధ్యత కూడా గవర్నర్‌దేనని చెప్పారు.

పార్టీ ఫిరాయింపుల చట్టంలో మార్పులు తీసుకురావల్సిన అవసరం ఎంతైనా ఉందని యనమల అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఉన్న చట్టంలో లోపాలు ఉన్నాయని, అన్ని పార్టీలూ ఈ లోపాలపై దృష్టిసారించాల్సిన అవసరం ఉందన్నారు.

పార్టీ ఫిరాయింపుల అంశంపై కూడా చట్టంలో అనేక సవరణలు తీసుకురావల్సి ఉందని చెప్పారు. శాసనసభ స్పీకర్‌గా సుదీర్ఘకాలం పని చేసిన అనుభవంలో చూసినపుడు ఫిరాయింపుల చట్టంలో మార్పులు అవసరమని తనకు వ్యక్తిగతంగా కూడా అనిపించిందన్నారు.

Yanamala demands clarity on Section 8

వేరే పార్టీ గుర్తుతో ఎన్నికైన వ్యక్తి మరో పార్టీ అధికారంలో ఉన్న సందర్భంలో మంత్రివర్గంలో మంత్రిగా ఉండటం విడ్డూరమని, అయితే ఈ అంశంపై చట్టంలో ఎలాంటి స్పష్టత లేదన్నారు.

పార్టీ ఫిరాయించే వారికి ఓటు లేకుండా చేస్తే బావుంటుందని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో రహస్య ఓటింగ్ విధానాన్ని తొలగించాలని చెప్పారు. పార్లమెంటులో కూడా దీనిపై సవరణలు చేయాల్సి ఉందని అన్నారు. రాజీనామాలు ఆమోదించని పక్షంలో స్పీకర్ ఏం చేయాలన్న దానిపై కూడా స్పష్టత లేదన్నారు.

విభజన బిల్లులో పొందుపర్చినట్లుగా సెక్షన్ 8ను అమలు చేయాలని, ఈ వ్యవహారంలో గవర్నర్ నిక్కచ్చిగా వ్యవహరించాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు నారాయణ డిమాండ్ చేశారు.

అంత అవసరం లేదనుకుంటే సెక్షన్ 8కి అవసరమైన మార్పులు చేసుకోవాలన్నారు. మరోవైపు, సెక్షన్ 8 ఊసొద్దని కేసీఆర్ గవర్నర్‌ను కలిసిన విషయం తెలిసిందే. సెక్షన్ 8 విషయంలో గవర్నర్ నరసింహన్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+