సమైక్యం ద్రోహి: జగన్‌పై యనమల, మా పొత్తు సునామే

Yanamala fires at YS Jagan
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. జైల్లో నుంచి బయటకు రావడానికి సమైక్యవాదాన్ని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి తాకట్టు పెట్టడం నిజం కాదా అని జగన్‌ను ప్రశ్నించారు.

భారతీయ జనతా పార్టీతో టిడిపి పొత్తును విభజన పొత్తు అని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అనడం పట్ల యనమల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టికల్ 3 ప్రకారం రాష్ట్ర విభజన చేయమని చెప్పింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కాదా అని యనమల రామకృష్ణుడు ప్రశ్నించారు.

బిజెపి, టిడిపి పొత్తు రాష్ట్రంలో రాజకీయ సునామీ సృష్టిస్తుందని యనమల అన్నారు. ఈ సునామీలో కాంగ్రెస్ పార్టీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కొట్టుకుపోతాయనే భయం ఆ పార్టీల్లో కనిపిస్తోందని అన్నారు.
కేరళ రాష్ట్రంలో ముస్లిం లీగ్‌తో పొత్తు పెట్టుకున్నప్పుడు సెక్యులరిజం గుర్తుకురాలేదా అని యనమల ప్రశ్నించారు.

సెక్యులరిజం ముసుగులో ప్రజలను మరోసారి మోసం చేయాలని కాంగ్రెస్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలు చూస్తున్నాయని యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. టిడిపి, బిజెపి ఉమ్మడి అజెండా అభివృద్ధి, పారదర్శక పాలనే అని అన్నారు. దేశంలో బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ, రాష్ట్రంలో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు మచ్చలేని పాలన అందిస్తారని ప్రజలు నమ్ముతున్నారని యనమల తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+