నోట్ల రద్దుపై నారాయణ ఆసక్తికరం, అది సరికాదు: మోడీకి యనమల ఝలక్
నోట్ల రద్దు లోపాలను సరిచేయాలని అన్ని పార్టీలు డిమాండ్ చేస్తున్నాయని మంత్రి యనమల అన్నారు. బ్యాంకుల నుంచి నగదు విత్ డ్రా పైన ఆంక్షలు సరికాదన్నారు.
అనంతపురం: పెద్ద నోట్ల రద్దుతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సిపిఐ నేత నారాయణ శుక్రవారం అన్నారు. నోట్ల రద్దు విషయం బడా వ్యాపారులకు ముందే తెలుసునని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 28వ తేదీన కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తామన్నారు. అనంతపురం ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ ఎదుట సీపీఐ ధర్నా నిర్వహించింది. ఈ ధర్నాలో నారాయణ పాల్గొన్నారు.

ఇబ్బందులున్నా జీతాలు ఇస్తున్నాం: యనమల
నోట్ల రద్దు తర్వాత ప్రభుత్వం ఆదాయం తగ్గుదల పైన నెలాఖరులో స్పష్టత వస్తుందని ఏపీ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు శుక్రవారం నాడు అన్నారు. ఇబ్బందులు ఉన్నప్పటికీ ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నామని చెప్పారు.
నోట్ల రద్దు నిర్ణయాన్ని ఏ పార్టీ వ్యతిరేకించలేదన్నారు. అయితే, లోపాలను సరిచేయాలని అన్ని పార్టీలు డిమాండ్ చేస్తున్నాయన్నారు. బ్యాంకుల నుంచి నగదు విత్ డ్రా పైన ఆంక్షలు సరికాదన్నారు.
మరోవైపు, ఏపీ రాజధాని అమరావతిలో అసెంబ్లీ భవన నిర్మాణం పైన మాట్లాడుతూ.. డిసెంబర్ నేలాఖరుకల్లా భవనం పూర్తి అవుతుందన్నారు. జనవరి మొదటి వారంలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ నెల పెన్షన్లు బ్యాంకుల్లో జమ చేస్తామని, వృద్ధులకు మాత్రమే నగదు రూపంలో చెల్లిస్తామన్నారు.












Click it and Unblock the Notifications