విదేశాలకు వెళ్లి రాగానే పెట్టుబడులు రావు: యనమల ట్విస్ట్

Posted By:
Subscribe to Oneindia Telugu

విజయవాడ: విదేశీ పర్యటనలు చేసి రాగానే పెట్టుబడులు రావని, కొంత సమయం పడుతుందని మంత్రి యనమల రామకృష్ణుడు శుక్రవారం నాడు అన్నారు. చంద్రబాబు పెట్టుబడుల కోసం వరుసగా విదేశీ పర్యటనలు చేస్తున్న విషయం తెలిసిందే. దీనిపై యనమల పైవిధంగా స్పందించారు.

ఫోన్ ట్యాపింగ్ ఎఫెక్ట్, బాబు జాగ్రత్త: టెలికం సర్కిల్ ఏర్పాటు

రూ.7300 కోట్ల విలువైన పెట్టుబడులు రాష్ట్రానికి వస్తున్నాయని చెప్పారు. దీని వల్ల సుమారు పదివేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. కేబినెట్ సమావేశంలో 9 ప్రాజెక్టులకు అంగీకారం తెలిపామన్నారు. పారిశ్రామిక అభివృద్ధిపై సీఎం దృష్టి పెట్టారన్నారు.

Yanamala interesting comments on investments

ఏడు మిషన్లు, 5 గ్రిడ్లను అధికారులు దృష్టిలోపెట్టుకోవాలని తెలిపారు. వినూత్న ఆలోచనలు, మెరుగైన పనితీరుతో ప్రభుత్వం సొమ్ము ఆదా చేయవచ్చునని చెప్పారు. ప్రతి ఇంటిని ఇంటర్నెట్‌తో అనుసంధానం చేస్తామని చెప్పారు. రాష్ట్రస్థాయిలో ప్రణాళికలు, కుటుంబ స్థాయిలో సేవలు ఉండాలన్నారు.

పథకాలను మరింత లోతుగా ప్రజల్లోకి తీసుకు పోవాలని సూచించారు. కష్టకారంలో రాష్ట్రం నుంచి పరిపాలన సాగిస్తున్నామని చెప్పారు. మన కాళ్ల పైన మనం నిలబడి పని చేసి, ఎదగాలని చెప్పారు. చంద్రబాబు అధికారులతో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పై సూచనలు చేశారు.

జగన్ పైన అచ్చెన్నాయుడు ఆగ్రహం

ఏపీకి పరిశ్రమలు రావడం లేదని వస్తున్న వ్యాఖ్యల పైన మంత్రి అచ్చెన్నాయుడు శుక్రవారం స్పందించారు. కొంతమంది రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. దీనిని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. వైసిపి నేత కొత్త నాటకాలతో ప్రజలను గందరగోళానికి గురి చేస్తున్నారన్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
AP Minister Yanamala Ramakrishnudu interesting comments on investments.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి