జగన్, బీజేపీ కుమ్మక్కుకు ఇదే గొప్ప నిదర్శనం: కుట్రలంటూ యనమల నిప్పులు
అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ, బీజేపీలపై ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. భుధవారం ఆయన మాట్లాడుతూ.. వైసీపీ, బీజేపీలు కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నామని ఆరోపించారు.

ఇది బీజేపీ, వైసీపీ లాలూచీ కాదా?
వైసీపీ ఎంపీలు రాజీనామా చేసిన ఐదు లోక్‌సభ స్థానాల్లో ఉప ఎన్నికలు ఎందుకు రాలేదో వైయస్ జగన్మోహన్ రెడ్డి చెప్పాలని యనమల డిమాండ్ చేశారు. బీజేపీ, వైసీపీ లాలూచీలో భాగంగానే ఉప ఎన్నికలు జరగడం లేదని ఆయన ధ్వజమెత్తారు.

బీజేపీతో కుమ్మక్కై...
వైసీపీ ఎంపీల కన్నా 40రోజుల తర్వాత రాజీనామా చేసిన మూడు స్థానాలకు కర్ణాటకలో ఉప ఎన్నికలు వచ్చాయని, ఏపీలో రాలేదంటే కుమ్మక్కైనట్లు స్పష్టమవుతోందని యనమల రామకృష్ణుడు దుయ్యబట్టారు. రాజీనామాల తాత్సారం అయ్యేలా చేసిందెవరని ప్రశ్నించారు.

మోడీ, అమిత్ షా, జగన్...
ప్రధాని మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, జగన్ కుమ్మక్కయ్యారని యనమల ఆరోపించారు. అందుకే ఉప ఎన్నికలు రావనే కుట్రను టీడీపీ అప్పుడే బయటపెట్టిందని అన్నారు. తాజాగా ఎన్నికల సంఘం ప్రకటనతో తేలిపోయిందని యనమల చెప్పారు.

ఒక్కరోజు ముందుగా.. ఏపీ కుట్రలు...
ఓటమి భయంతోనే ఉప ఎన్నికలు రాకుండా చేశారని, ఏడాది గడువుకు ఒక రోజు తగ్గేలా చూసి ఆమోదించుకున్నారని యనమల రామకృష్ణుడు ఆరోపించారు. ఉప ఎన్నికల్లో టీడీపీ గెలుస్తుందనే భయంతోనే ఇలా చేశారన్నారు. కేంద్రంలోని బీజేపీ నేతలు రాజకీయ కుట్రలతోపాటు ఆర్థికపరమైన కుట్రలు కూడా చేస్తున్నారని మండిపడ్డారు. ఏపీ రావాల్సిన నిధులను కూడా వెనక్కి తీసుకున్నారని ఆరోపించారు.












Click it and Unblock the Notifications