వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అప్పులు పుట్టకే ప్రభుత్వం ఓటీఎస్ నాటకం: జగన్ మాస్టర్ ప్లాన్ ఇదేనన్న యనమల

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వన్ టైం సెటిల్మెంట్ పై రగడ కొనసాగుతూనే ఉంది. అధికార ప్రతిపక్ష పార్టీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఓటీఎస్ ఒక మంచి పథకం అని వైసీపీ, బలవంతపు వసూళ్లు అని టీడీపీ పెద్ద ఎత్తున వ్యాఖ్యలు చేస్తున్నారు. వైసీపీ మంత్రులు, ముఖ్యమంత్రి ఓటీఎస్ పై ఎన్ని సార్లు క్లారిటీ ఇచ్చినా సరే టీడీపీ నేతలు ఓటీఎస్ ను టార్గెట్ చేస్తూనే ఉన్నారు.

బూతుల మంత్రితో పోటీపడి కొబ్బరిచిప్పల మంత్రి; వీధి రౌడీలా అశోక్ గజపతిపై దాడి: చంద్రబాబుబూతుల మంత్రితో పోటీపడి కొబ్బరిచిప్పల మంత్రి; వీధి రౌడీలా అశోక్ గజపతిపై దాడి: చంద్రబాబు

ఉగాది వరకు ఓటీఎస్ పొడిగించామని చెప్పిన జగన్.. అయినా టీడీపీ విమర్శలు

ఉగాది వరకు ఓటీఎస్ పొడిగించామని చెప్పిన జగన్.. అయినా టీడీపీ విమర్శలు

మంగళవారం నాడు జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా తణుకులో జగనన్న గృహ హక్కు పథకాన్ని ప్రారంభించి, ఇది నిరుపేదలకు లబ్ధి చేకూర్చే పథకమని, పేదల సొంతింటి కలను నెరవేర్చే పథకమని, ప్రతిపక్ష పార్టీలు కావాలని దీనిపై దుష్ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. నిరుపేదలకు మంచి జరుగుతుంటే కడుపు మంట దేనికి అంటూ ప్రశ్నించారు. ఎలాంటి అపోహలకు తావు లేకుండా నిరుపేదలు వన్టైమ్ సెటిల్మెంట్ ద్వారా సొంతింటి కల నెరవేర్చుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఉగాది వరకు ఈ పథకాన్ని పొడిగిస్తున్నట్లుగా సీఎం జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. అయినా సరే టీడీపీ నేతలు మాత్రం విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు.

ఓటీఎస్ పేరుతో దోపిడీకి మాస్టర్ ప్లాన్

ఓటీఎస్ పేరుతో దోపిడీకి మాస్టర్ ప్లాన్

ఇక ఇదిలా ఉంటే ఏపీ మాజీ ఆర్థిక మంత్రి, టిడిపి సీనియర్ నాయకులు యనమల రామకృష్ణుడు ఓటిఎస్ అమలు చట్టవిరుద్ధమని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చట్ట ప్రకారం ఇప్పటికే హక్కులు సంక్రమించిన ఇళ్లకు కూడా జగన్మోహన్ రెడ్డి ఓటిఎస్ ను అమలు చేసి దోచుకుంటున్నారు అంటూ యనమల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పులపాలు అయిందని, అప్పులు పుట్టక ప్రభుత్వం ఓటిఎస్ పేరుతో నాటకాలు ఆడుతోందని యనమల రామకృష్ణుడు విమర్శించారు. ఓటిఎస్ పేరుతో పేదల నుంచి 5 వేల కోట్లు దోచుకోవడానికి మాస్టర్ ప్లాన్ రెడీ చేశారని అందులో భాగంగానే ప్రస్తుతం ఓటిఎస్ దోపిడీ కొనసాగుతుందని యనమల రామకృష్ణుడు స్పష్టం చేశారు.

వాస్తవాలను మరుగున పెట్టి సెటిల్మెంట్ చేస్తామని చెప్పడం పేద ప్రజలను మోసగించడమే

వాస్తవాలను మరుగున పెట్టి సెటిల్మెంట్ చేస్తామని చెప్పడం పేద ప్రజలను మోసగించడమే

లిమిటేషన్ యాక్ట్ ప్రకారం పేదల ఇళ్లకు పన్నెండేళ్ల తర్వాత పూర్తి హక్కులు వస్తాయని, వాస్తవాలను మరుగున పెట్టి సెటిల్మెంట్ చేస్తామని చెప్పడం పేద ప్రజలను మోసగించడమేనని యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. ఏడాదికి 5 లక్షల చొప్పున ఇళ్లు కడతామని చెప్పిన జగన్ రెండున్నరేళ్లలో ఒక్క ఇల్లు అయినా కట్టారా అంటూ యనమల రామకృష్ణుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఇచ్చిన హామీలకు జగన్ రెడ్డి తూట్లు పొడిచారని యనమల రామకృష్ణుడు మండిపడ్డారు.

ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే టిడిపి హయాంలో నిర్మించిన టిడ్కో ఇళ్ళు పేదలకు ఇవ్వాలి

ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే టిడిపి హయాంలో నిర్మించిన టిడ్కో ఇళ్ళు పేదలకు ఇవ్వాలి

తెలుగుదేశం పార్టీ గత ఐదేళ్లలో 10.5 లక్షల ఇళ్లు పేదల కోసం నిర్మించిందని పేర్కొన్నారు యనమల రామకృష్ణుడు. ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీ హయాంలో నిర్మించిన 2.62 లక్షల టిడ్కో ఇల్లు పేదలకు ఇవ్వలేదని మండిపడ్డారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే టిడిపి హయాంలో నిర్మించిన టిడ్కో ఇళ్ళు పేదలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వైసీపీ సర్కార్ నివాసయోగ్యం కాని చోట్ల ఇళ్ల స్థలాలు ఇచ్చిన ఏడు వేల కోట్లు దోచుకున్నదని మండిపడ్డారు. రాజధానిలో తాము కట్టించిన ఐదు వేల ఇళ్లు పేదలకు ఇవ్వకుండా తప్పుడు ప్రచారం చేస్తారా అంటూ ప్రశ్నించారు.

ఓటీఎస్ పేరుతో బలవంతపు వసూళ్లు దుర్మార్గం

ఓటీఎస్ పేరుతో బలవంతపు వసూళ్లు దుర్మార్గం


ఓటిఎస్ పేరుతో ప్రభుత్వం బలవంతపు వసూళ్లకు దిగడం దుర్మార్గమని మండిపడిన యనమల రామకృష్ణుడు, కరోనా మహమ్మారి కారణంగా పేదలకు రోజు గడవడమే కష్టంగా మారిందని, ఈ సమయంలో ఈ విధంగా బలవంతపు వసూళ్లు అవసరమా అంటూ అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే నిరుపేదల ఇళ్ళను ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలని, అలా కాకుండా వసూళ్ళకు పాల్పడటం కేవలం దోపిడీ కోసమేనని యనమల రామకృష్ణుడు డిమాండ్ చేశారు.

English summary
Yanamala Ramakrishnudu has fired that the government has opened up to exploitation with OTS and that the implementation of OTS is illegal. yanamala ramakrishnudu demanded to give Tidco houses built under the TDP regime.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X