అమరావతి శంకుస్ధాపన: జగన్‌పై టీడీపీ నేతలు మూకుమ్మడి దాడి
అమరావతి: నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి శంకుస్థాపన మహోత్సవానికి హాజరైన ప్రధాని మోడీ దిష్టిబొమ్మలు తగుబెట్టిన తల్లి, పిల్ల కాంగ్రెస్‌లు ఒకే గూటి పక్షులని ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ భూదేవి, గంగను కించపరచడం దైవ ద్రోహమని ప్రతిపక్షాలపై మండిపడ్డారు.
కేంద్ర ప్రభుత్వం, పొరుగు రాష్ట్రాలతో ఘర్షణపడి ఏం సాధించలేమని పేర్కొన్నారు. గతంలో పంచ భూతాలను స్వాహా చేసిన ప్రతిపక్షాలు ఇప్పుడు కించపరుస్తున్నారన్నారు. పదమూడు వేల గ్రామాల నుంచి మట్టి తెస్తే వారి నమ్మకాన్ని, విశ్వాసాన్ని కించపరచకూడదన్నారు.
వైయస్ జగన్‌పై టీడీపీ నేత బీదా రవిచంద్ర ఘాటు విమర్శలు

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత వైయస్ జగన్‌పై టీడీపీ ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర నిప్పులు చెరిగారు. శనివారం నెల్లూరులో మీడియాతో మాట్లాడిన ఆయన వైయస్ జగన్ తెలుగు సంప్రదాయాలు తెలియవని ఎద్దేవా చేశారు.
నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి శంకుస్థాపన మహోత్సవం విజయవంతం కావడాన్ని ప్రతిపక్షాలు జీర్ణించుకోలేక పోతున్నాయన్నారు. శంకస్థాపన కార్యక్రమంపై ప్రతిపక్ష నేత జగన్, ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.
అక్రమాస్తుల కేసు నుంచి బయటపడేందుకు జగన్ కేంద్ర హోం మంత్రితో రహస్య మంతనాలు సాగిస్తున్నారని కూడా రవిచంద్ర ఆరోపించారు. నెల్లూరు రొట్టెల పండుగ దర్గా కమిటీలో ఎలాంటి వివాదం లేదని, దీనిపై వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
జగన్ అభివృద్ధిని అడ్డుకుంటున్నారు: సతీష్‌రెడ్డి
ప్రతిపక్ష నేత వైయస్ జగన్ ఏపీ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని మండలి డిప్యూటీ చైర్మన్ సతీష్‌రెడ్డి అన్నారు. పులివెందుల నియోజకవర్గంలో టీడీపీ ఆధ్వర్యంలో సైకిల్ యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా మండలి డిప్యూటీ చైర్మన్ సతీష్‌రెడ్డి మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కోసమే సైకిల్ యాత్ర నిర్వహిస్తున్నామని తెలిపారు.
జగన్ రాష్ట్ర ప్రజలను అవమానపరిచారు: సోమిరెడ్డి
ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్ రాజధాని అమరావతి శంకుస్థాపనకు రాకుండా రాష్ట్ర ప్రజలను అవమానపరిచారని ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఆరోపించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్‌కు ఓదార్పుయాత్రలు తప్ప అభివృద్ధి పట్టవని ఎద్దేవా చేశారు.
పది సంవత్సరాల్లో చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ కన్నా రెట్టింపు రెవెన్యూ ఆదాయం వచ్చేలా అమరావతిని నిర్మిస్తామని ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications