‘నేరాల చక్రవర్తి’లో అన్ని ఘోరాలే: జగన్‌ను ఏకేసిన యనమల
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ‘నేరాల చక్రవర్తి'పేరిట త్వరలో జగన్‌పై పుస్తకాన్ని విడుదల చేయనున్నట్లు.
అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. 'నేరాల చక్రవర్తి'పేరిట త్వరలో జగన్‌పై పుస్తకాన్ని విడుదల చేయనున్నట్లు యనమల రామకృష్ణుడు తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు.
జగన్ చేసిన నేరాలు, ఘోరాలను సాక్ష్యాలతో సహా సవివరంగా వెల్లడిస్తామన్నారు. అలాగే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తెచ్చిన పుస్తకం అబద్ధాల పుట్ట అని అన్నారు. ప్రజల్లో విశ్వాసం కోల్పోయిన పార్టీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీకి అధినేత ఉన్న జగన్ ప్రతిపక్ష నేతగా పనికి రారని మంత్రి యనమల అన్నారు.

కోర్టు కేసులు, దొంగ దీక్షలతో జగన్ అభివృద్ధి నిరోధకుడిగా మారారని, ప్రజల్లో విశ్వాసం కోల్పోయిన నాయకుడు జగన్ అని యనమల అన్నారు. జగన్ పార్టీ పెట్టినప్పుడే కన్సల్టెన్సీ పెట్టుకోవాల్సిందని, పార్టీ పెట్టి ఆరేళ్లయ్యాక కన్సల్టెన్సీ పెట్టుకుని ఏం ఉద్ధరిస్తారని మంత్రి అన్నారు.
రాజధానిని వ్యతిరేకించి అక్కడే ప్లీనరీ పెడతారా?: కళా వెంకట్రావ్ ధ్వజం
Recommended Video

గుంటూరు, కృష్ణా జిల్లాలో రాజధాని వద్దన్న జగన్ ఇదే ప్రాంతంలో ప్లీనరీ సమావేశాలు నిర్వహించడం ఎంతవరకు సమంజసమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు ప్రశ్నించారు. కేసుల నుంచి తప్పించుకునేందుకే జగన్ పార్టీని నడిపిస్తున్నారని.. పేద ప్రజలకు సేవ చేసే ఉద్దేశం ఆయనకు లేదని విమర్శించారు.
గుంటూరు జిల్లా మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహాస్వామి, పానకాల లక్ష్మీ నరసింహస్వామి వారిని కళా వెంకట్రావు దంపతులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారికి ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.












Click it and Unblock the Notifications