వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీలో పట్టపగలే ప్రజాధనం నిలువుదోపిడీ; రాష్ట్రం ముందుందని చెప్పడం తుపాకిరాముడు కోతలే: యనమల రామకృష్ణు

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జగన్ సర్కారు తీరుపై మాజీ మంత్రి, టిడిపి పొలిట్బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్థిక వ్యవస్థను చక్కబెట్టడం కోసం ఫిస్కల్ కౌన్సిల్ ఏర్పాటు చేయాలనే టిడిపి సహా దేశంలోని ఆర్థిక నిపుణుల డిమాండ్ ను ప్రభుత్వం తిరస్కరించిన సరికాదని యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. ఫిస్కల్ కౌన్సిల్ అవసరం లేదని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ చెప్పడం హాస్యాస్పదంగా ఉందని టిడిపి పోలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు వెల్లడించారు.

వైసీపీ నేతలవి నీఛ రాజకీయాలు.. చేతగాని మీరు మాపై విమర్శలా: అచ్చెన్నాయుడు ఆగ్రహంవైసీపీ నేతలవి నీఛ రాజకీయాలు.. చేతగాని మీరు మాపై విమర్శలా: అచ్చెన్నాయుడు ఆగ్రహం

బడ్జెట్ కేటాయింపులు దుబారా చేశారు

బడ్జెట్ కేటాయింపులు దుబారా చేశారు

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక నిర్వహణ బాగుందని చెప్పడం నిజాలు కప్పి పెట్టడమేనని యనమల రామకృష్ణుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. వృద్ధిరేటు 10.22 ను మైనస్ 2.52 శాతానికి రివర్స్ చేశారని యనమల రామకృష్ణుడు ఎద్దేవా చేశారు. సంక్షేమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందుంది అని చెప్పడం తుపాకి రాముడు కోతలేనని యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బడ్జెట్ కేటాయింపులు దుబారా చేశారని, పట్టపగలే ప్రజాధనం నిలువు దోపిడీ చేశారని వైసీపీ సర్కార్ పై ఆరోపణలు గుప్పించారు యనమల.

 ఫిస్కల్ కౌన్సిల్ ఏర్పాటుకు టీడీపీ డిమాండ్

ఫిస్కల్ కౌన్సిల్ ఏర్పాటుకు టీడీపీ డిమాండ్

అందుకే ప్రభుత్వాన్ని ఫిస్కల్ కౌన్సిల్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నామని యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. ఆర్ధిక నిపుణులు పేర్కొన్నట్లుగా ఫిస్కల్ కౌన్సిల్ ఏర్పాటు ఏపీలో తక్షణావశ్యకం ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత తప్పిన ఆర్థిక వ్యవస్థను మళ్ళీ గాడిలోకి తీసుకు రావడం కోసం, రాష్ట్ర ప్రభుత్వం భవిష్యత్తు కార్యాచరణపై గ్రీన్ పేపర్ విడుదల చేయాలని యనమల రామకృష్ణుడు డిమాండ్ చేశారు. సంక్షేమమే బాగుంటే డిబిటి లో 19వ, పేదరికంలో 20వ స్థానాలలో రాష్ట్రం ఎందుకు ఉందో చెప్పాలి అని యనమల రామకృష్ణుడు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ను ప్రశ్నించారు.

 ఏపీ ప్రభుత్వానికి, ఆర్ధిక మంత్రికి పలు ప్రశ్నలను సంధించిన యనమల

ఏపీ ప్రభుత్వానికి, ఆర్ధిక మంత్రికి పలు ప్రశ్నలను సంధించిన యనమల

డీబీటీ కింద పేదల సంక్షేమ పథకాలు ఎందుకు రద్దు చేశారో చెప్పాలని యనమల రామకృష్ణుడు ప్రభుత్వాన్ని నిలదీశారు. ఆర్థిక అసమానతలు రాష్ట్రంలో 34 శాతం నుండి 49 శాతానికి ఎందుకు పెరిగాయో చెప్పాలన్నారు యనమల రామకృష్ణుడు. మూలధన వ్యయం 19,976 కోట్ల నుంచి పద్నాలుగు వేల కోట్లకు ఎందుకు పడిపోయిందో చెప్పాలన్నారు. ప్రభుత్వ పథకాల లబ్ధి నుంచి ఎంత మంది పేదలను తప్పించారో చెప్పాలని యనమల రామకృష్ణుడు డిమాండ్ చేశారు.

Recommended Video

TDP Criticizes YSRCP Over Liquor Rates Hike | ప్రజల జేబులు గుల్ల చేస్తున్నారు..!!
భవిష్యత్ కార్యాచరణపై శ్వేతపత్రం విడుదల చెయ్యండి

భవిష్యత్ కార్యాచరణపై శ్వేతపత్రం విడుదల చెయ్యండి

వైసిపి మూడేళ్ల పాలనలో 3,71, 756 కోట్ల అప్పు చేసిందని ఆరోపించారు టీడీపీ నేత యనమల రామకృష్ణుడు. ఇది స్పష్టంగా ఎఫ్ ఆర్ బి ఎం పరిమితులను ఉల్లంఘించడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి యనమల. అంతేకాదు బడ్జెట్ మాన్యువల్ కాల రాశారని నిప్పులు చెరిగారు. రాష్ట్ర ప్రభుత్వ భవిష్యత్ కార్యాచరణపై శ్వేతపత్రం విడుదల చేయాలని యనమల రామకృష్ణుడు డిమాండ్ చేశారు.

English summary
Yanamala has accused the YSRCP government of squandering budget allocations in the state of Andhra Pradesh and misused people money . Demanded that a Fiscal Council be set up.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X