పవన్‌పై కేసు: యనమల సంచలనం, జగన్‌పై జైరాం
రాజమండ్రి: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు బుధవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేన పార్టీ అధ్యక్షులు, టిడిపి-బిజెపి కూటమికి మద్దతు పలుకుతున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పైన కేసు నమోదు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి హస్తం ఉందని ఆరోపించారు.
తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో ఆయన మాట్లాడారు. టిడిపి, బిజెపి కూటమికి పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తున్నాడనే అక్కసుతోనే జగన్ తెరాస నేతలతో కేసు పెట్టించారన్నారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆదేశాల మేరకే కుట్ర జరుగుతోందన్నారు. తెలంగాణలో తెరాస, సీమాంధ్రలో జగన్ పార్టీలు కాంగ్రెసు పార్టీకే మద్దతు తెలుపుతాయన్నారు.

అంబులెన్స్‌లో ఎర్రబెల్లి
తీవ్ర అతస్వస్థకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న టిడిపి సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర రావు బుధవారం అంబులెన్స్‌లోనే తిరుగుతూ పోలింగ్ సరళిని సమీక్షిస్తున్నారు.
సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎర్రబెల్లి దయాకర రావు ప్రచారం నిర్వహిస్తూ మంగళవారం అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. తెలంగాణ వ్యాప్తంగా బుధవారం పోలింగ్ నేపథ్యంలో... ఇంకా ఆస్పత్రిలోనే ఉన్న ఎర్రబెల్లి డాక్టర్లు, కార్యకర్తల సహాయంలో అంబులెన్స్‌లో తిరుగుతూ తన నియోజకవర్గంలో పోలింగ్ సరళిని ఆయన సమీక్షిస్తున్నారు.
జగన్ పైన మండిపడ్డ జైరాం
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన కేంద్రమంత్రి జైరాం రమేష్ మండిపడ్డారు. జగన్ పార్టీ అలీబాబా 40 దొంగల పార్టీ అన్నారు. జగన్‌ను ఎన్నుకుంటే అభివృద్ధి ఎలా సాధ్యమన్నారు. ఎలాంటి నేతను ఎంచుకుంటారో సీమాంధ్రులు ప్రశ్నించుకోవాలన్నారు. ఎన్నికల్లో గెలిచేందుకు జగన్ పార్టీ డబ్బును నీళ్లలా ఖర్చు చేస్తోందని ఆరోపించారు. జగన్ పార్టీ ప్రజాస్వామ్యానికే ముప్పు అన్నారు. జగన్ తీరు చూసి వైయస్ ఆత్మ క్షోభిస్తుందన్నారు.












Click it and Unblock the Notifications