బాబుపై యాష్కీ నిప్పులు: కిరణ్ ఫోటో తీసేసి.. ఆజాద్‌ది

Yashki fires at Chandrababu
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పైన నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు, కాంగ్రెసు సీనియర్ నేత మధుయాష్కీ ఆదివారం మండిపడ్డారు. తెలంగాణ ప్రాంత కాంగ్రెసు నేతలు ఢిల్లీ నుండి హైదరాబాద్ వచ్చారు. ఈ సమయంలో ఆయన మాట్లాడారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మద్దతంటూనే చంద్రబాబు ఇతర రాష్ట్రాలలో ఎందుకు తిరిగారో చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీని ఎవరు ఆదరించవద్దన్నారు. సీమాంధ్రులకు అండగా ఉండాలని తమకు పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ చెప్పారన్నారు. కిరణ్ ఆరిపోయిన దీపమని, ఆయనను సీమాంధ్ర ప్రజలు ఆదరించరన్నారు.

ఎల్లుండి నుండి తాము జిల్లాలో విజయోత్సవ సభలు నిర్వహిస్తామని షబ్బీర్ అలీ చెప్పారు. మార్చి మొదటి వారంలో సోనియా, రాహుల్ గాంఎధీలు హైదరాబాదుకు వస్తారన్నారు. అరవయ్యేళ్ల తెలంగాణ కలను సాకారం చేసిన సోనియా తెలంగాణ తల్లి అన్నారు. సోనియాకు కృతజ్ఞతగా సభలు నిర్వహిస్తామన్నారు.

కిరణ్ ఫోటో తీసేసి ఆజాద్ ఫోటో

హైదరాబాదులోని గాంధీ భవన్లోని మీడియా హాల్లో కిరణ్ కుమార్ రెడ్డి ఫోటోను తీసేసి.. ఆ స్థానంలో కేంద్రమంత్రి గులాం నబీ ఆజాద్ ఫోటోను ఉంచారు. షబ్బీర్ అలీ, దానం నాగేందర్‌లు ఆ ఫోటో ఏర్పాటు చేశారు. శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న తెలంగాణ ప్రాంత కాంగ్రెసు ఎంపీలు, మంత్రులకు దానం నాగేందర్, షబ్బీర్ అలీ స్వాగతం పలికారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+