శాఖను మార్చొచ్చు కానీ: కిరణ్‌పై యాష్కీ, విహెచ్ లేఖ

వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందన్నారు. రెండు రాష్ట్రాలలో ఎన్నికలు జరుగుతాయన్నారు. తెలంగాణ బిల్లు పార్లమెంటు ఆమోదం పొందిన వెంటనే రాష్ట్రం ఏర్పడుతుందని చెప్పారు. తెలంగాణ, కొత్త ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోలేమన్న విషయం కిరణ్ కుమార్ రెడ్డి తెలుసుకుంటే బావుంటుందన్నారు. టి బిల్లు ప్రతులు తగులబెట్టి సీమాంధ్ర నేతలు పైశాచిక ఆనందం పొందుతున్నారన్నారు.
బ్యాంకులకు టోపీ: విహెచ్
పార్టీ పేరు చెప్పి సీమాంధ్రలో కొందరు కాంగ్రెసు పార్టీ నేతలు బ్యాంకులకు కుచ్చుటోపీ పెట్టారని రాజ్యసభ సభ్యులు, కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత వి హనుమంత రావు బుధవారం అభిప్రాయపడ్డారు. ఆయన ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖ రాశారు. అందులో ఆయన సీమాంధ్ర నేతల పైన మండిపడ్డారు.
పార్టీ పేరు చెప్పి కొందరు సీమాంధ్ర కాంగ్ నేతలు బ్యాంకులకు టోపీ పెట్టారని పేర్కొన్నారు. పార్టీ పేరు చెప్పి కొందరు రుణాలు తీసుకొని ఎగ్గొట్టారని, కోట్లు సంపాదించారని సోనియాకు రాసిన లేఖలో పేర్కొన్నారు. అలాంటి వారిని పార్టీకి దూరంగా పెట్టాలని సూచించారు. రాష్ట్రంలో కాంగ్రెసు పార్టీని ప్రక్షాళన చేయాలని కోరారు. అవకాశవాద రాజకీయాలకు పాల్పడుతున్న వారిని పక్కన పెట్టాలని సూచించారు. ఈ మేరకు 17వ తేదీన ఏఐసిసి సమావేశంలో తీర్మానం చేయాలని కోరారు.
ధన్యవాద తీర్మానం కోసం..
ఏఐసిసి సమావేశంలో తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి ధన్యవాద తీర్మానం ప్రవేశ పెట్టేందుకు అవకాశం ఇవ్వాలని జనార్ధన్ ద్వివేదికి పొంగులేటి సుధాకర్ రెడ్డి లేఖ రాశారు.
కిరణ్‌పై పాల్వాయి ఆగ్రహం
కిరణ్ తమ్ముడు సెటిల్మెంట్లకు పాల్పడుతున్నారని పాల్వాయి గోవర్ధన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వైయస్ జగన్‌లా కిరణ్ జైలుకు వెళ్లక తప్పదన్నారు. కళంకిత నేతలను పార్టీలోకి తీసుకోవద్దని అధిష్టానాన్ని కోరారు. ఏఐసిసి సమావేశంలో సీమాంధ్ర నేతలు సమైక్యం పేరుతో గొడవ చేస్తే కార్యకర్తలు బయటకు తోసేస్తారన్నారు.












Click it and Unblock the Notifications