ఏపిలో ఆ పార్టీకి 22 ఎంపీ సీట్లు : ఎన్నికల వేళ..జాతీయ ఛానల్ సర్వే సంచలనం..!
ఏపిలో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. ఇదే సమయంలో సర్వేలు మరింత వేడిని పెంచుతున్నాయి. నువ్వా నేనా అన్నట్లుగా ఏపిలో సాగుతున్న ఎన్నికల పోరులో జాతీయ ఛానళ్లు సైతం ఆసక్తి ప్రదర్శిస్తున్నాయి. ఓ జాతీయ ఛానల్ సర్వే వివరాలను ప్రకటించింది. అందులో ఏపి లో ఆ పార్టీ ఏకంగా 22 ఎంపి సీట్లు సాధిస్తుందని వెల్లడించింది. ఇక, మరో ప్రధాన పార్టీకి మూడు సీట్లు మాత్రమే వస్తాయని తేల్చింది.
ఏపిలో వైసిపి సంచలనం..
కొద్ది కాలంగా వెలువడుతున్న జాతీయ ఛానళ్ల సర్వేలో వైసిపి కి ఎక్కువగా ఎంపి సీట్లు వస్తాయని చెబుతున్నాయి. దీని కి కొనసాగింపుగా తాజాగా టైమ్స్ నౌ-వీఎమ్‌ఆర్ ఒపినియన్ సర్వే సైతం అదే విషయాన్ని స్పష్టం చేసింది. ఏపిలో ఇప్ప టికే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. టిడిపి- వైసిపి ప్రధాన పార్టీలుగా ప్రచారం హోరెత్తిస్తున్నాయి. ముఖ్యమం త్రి చంద్రబాబు..వైసిపి అధినేత జగన్ సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఇదే సమయంలో టైమ్స్ నౌ-వీఎమ్‌ఆర్ ఒపినియన్ సర్వే వివరాలను బయట పెట్టింది.

25 లోక్‌సభ స్థానాలకు వైఎస్సార్‌సీపీ 22 గెలుచుకుంటుందని తెలి పింది. ఇక టీడీపీ కేవలం 3 సీట్లకే పరిమితమవుతుందని, ఈ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ 48.8 శాతం మంది ఓటర్లు మద్దతు పలకనున్నారని పేర్కొంది. కొద్ది రోజులుగా జాతీయ చానళ్లు ఇండియా టుడే వంటి మీడియా సంస్థలు సైతం ఏపిలో వైసిపి అత్యధిక లోక్‌సభ స్థానాలు గెలుచుకుంటుదని చెబుతూ వస్తున్నాయి.
వైసిపికి 48.8 శాతం ఓటింగ్..
ఏపిలో మొత్తం 25 లోక్‌సభ స్థానాల్లో వైసిసికి 48.8 శాతం ఓటింగ్ అనుకూలంగా జరుగుతుందని సర్వేలో పేర్కొన్నారు. ఇక, ఏపిలో యుపిఏ కు 2.2 శాతం, ఎన్డీఏ కు 5.8 శాతం, టిడిపికి 38.4 శాతం, ఇతరులకు 4.9 శాతం ఓటింగ్ అనుకూలం గా ఉన్నట్లు సర్వేలో పేర్కొన్నారు. ఈ అంచనాల ప్రకారం ఏపిలో వైసిపి కంటే టిడిపి కి దాదాపు 10 శాతం తక్కువగా మద్దతు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, జనసేన ఈ సారి ఎన్నికల్లో కీలకంగ మారుతుందని అంచనా వేస్తున్న సమ యం లో ఆ పార్టీకి సంబంధించి ఓట్ల శాతాన్ని ఈ సర్వేలో ఎక్కడా పేర్కొనలేదు. ఇక, ఇప్పుడు ఈ ఓటింగ్ శాతాల అం చనాలకు అనుగుణంగా అసెంబ్లీ సీట్లు ఎన్ని దక్కుతాయనే దాని పైనా పార్టీలు లెక్కలు వేస్తున్నాయి.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications