Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వైసీపీ తొలి ఎంపీ అభ్యర్ది ప్రకటన - మాజీ మంత్రికి సీటు ఖరారు..!!

ఏపీలో వైసీపీ దూకుడు మీద ఉంది. వై నాట్ 175 నినాదంతో ముందుకు వెళ్తోంది. తాజాగా ఎన్నికల సమరశంఖం పూరించిన సీఎం జగన్ ఎన్నికల కార్యాచరణ నిర్దేశించారు. ఈ సమయంలోనే వరుసగా అభ్యర్దుల ఖరారు పైన ఫోకస్ చేసారు. కీలకమైన నెల్లూరు జిల్లాలో ఎంపీ అభ్యర్దిని పార్టీ నేత సాయిరెడ్డి వెల్లడించారు. మరో మాజీ మంత్రికి సీటు ఖరారైంది. తనను పార్టీ పోటీకి వద్దంటే తప్పుకోవటానికి సిద్దంగా ఉన్నామంటూ అనిల్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

మారుతున్న సమీకరణాలు : ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. నెల్లూరు జిల్లా ఇప్పటి వరకు వైసీపీకి కంచుకోటగా ఉంది. ఇప్పుడు జిల్లాలో మారుతున్న లెక్కలతో సీఎం జగన్ అలర్ట్ అయ్యారు. ముందుగానే జిల్లాలో అభ్యర్దులను ఖరారు చేస్తున్నారు. అందులో భాగంగా నెల్లూరు ఎంపీ అభ్యర్ధిని ఖరారు చేసారు. వైసీపీ ఏర్పాటు నుంచి నెల్లూరు జిల్లా కంచుకోటగా ఉంది.

YCP Announces Vemireddy Prabahakar Reddy as Nellore Loksabah Candidate for next Elections

2019 ఎన్నికల్లో నెల్లూరు జిల్లాను వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఏకపక్షంగా విజయం సాధించింది. ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో జిల్లా నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు టీడీపీకి మద్దతుగా నిలిచారు. ఆ ముగ్గురిని వైసీపీ సస్పెండ్ చేసింది. దీంతో, నెల్లూరులో పట్టు పెంచుకొనేందుకు టీడీపీ ప్రయత్నాలు చేస్తోంది. దీంతో, వైసీపీ నాయకత్వం సీట్ల ఖరారు పైన నిర్ణయాలు తీసుకుంటోంది.

ఎంపీగా వేమిరెడ్డి ఖరారు : నెల్లూరు ఎంపీగా ఉన్న ఆదాల ప్రభాకర్ రెడ్డికి నెల్లూరు రూరల్ బాధ్యతలు కేటాయించారు. వచ్చే ఎన్నికల్లో ఆయనే రూరల్ అభ్యర్ధిగా ఖరారు చేసారు. దీంతో నెల్లూరు ఎంపీగా రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని బరిలోకి దించాలని సీఎం జగన్ నిర్ణయించారు. పార్టీ నేత విజయసాయిరెడ్డి నెల్లూరు ఎంపీ అభ్యర్దిని అధికారికంగా ప్రకటించారు. నెల్లూరు ఎంపీగా వరుసగా మూడు సార్లు మేకపాటి రాజమోహన్ రెడ్డి ఒకసారి కాంగ్రెస్, రెండు సార్లు వైసీపీ నుంచి గెలుపొందారు.

2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి వైసీపీలో చేరిన ఆదాల ప్రభాకర్ రెడ్డి విజయం సాధించారు. 2019లో టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసిన బీదా మస్తాన్ రావు ప్రస్తుతం వైసీపీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. పార్టీలో క్రియాశీలకంగా ఉన్నారు. 2024 ఎన్నికల్లో ఎంపీగా బరిలోకి దింపటం ద్వారా కలిసి వస్తుందనే అంచనాలు ఉన్నాయి.

YCP Announces Vemireddy Prabahakar Reddy as Nellore Loksabah Candidate for next Elections

అనిల్ కు సిటీ సీటు : ఇదే సమయంలో మాజీ మంత్రి అనిల్ సీటు పైన కొంత కాలంగా ఉన్న సందిగ్ధతకు తెర పడింది. ఎంపీగా వేమిరెడ్డి ఖరారు కావటంతో..తనను పోటీ చేయవద్దని ఫోన్ లో చెప్పినా తాను తప్పుకుంటానని మాజీ మంత్రి అనిల్ వ్యాఖ్యానించారు. తనకు రాజకీయాల కంటే జగన్ పైన అభిమానం ఎక్కువని చెప్పుకొచ్చారు. అయితే, ఎంపీతో పాటుగా నెల్లూరు సిటీ సీటును మరోసారి అనిల్ కు కేటాయిస్తూ పార్టీ నిర్ణయం తీసుకుంది.

బాలినేని స్థానంలో బాధ్యతలు తీసుకున్న సాయిరెడ్డి ఇప్పటికే తిరుపతి నుంచి భూమన అభినయ్,చంద్రగిరి నుంచి చెవిరెడ్డి భాస్కరరెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డిలను అభ్యర్దులుగా ప్రకటించారు. తాజాగా సీఎం జగన్ అభ్యర్దుల ఖరారు పైన కసరత్తు వేగవంతం చేసారు. ఇప్పుడు నెల్లూరులో అభ్యర్దులను అధికారికంగా ప్రకటించటం ద్వారా జిల్లాలో రాజకీయం మరింత ఆసక్తి కరంగా మారనుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+