పిఠాపురం వెళ్లి వైసీపీకి ప్రచారం చేసిన పవన్ కల్యాణ్
జనసేన అధినేత పవన్ కల్యాణ్ గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నారు. పవన్ కల్యాణ్ 2019 ఎన్నికల్లో భీమవరం, గాజువాక నియోజకవర్గాల్లో పోటీ చేసి రెండు చోట్ల ఓడిపోయారు . ఈసారి అలాంటి తప్పు జరగ్గకుండా జాగ్రత్తపడుతున్నారు. దీనిలో భాగంగానే కాపులు అధిక సంఖ్యలో ఉండే పిఠాపురం నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్నారాయన. ఎన్నికల ప్రచారంలో భాగంగా తాను పోటీ చేయబోయే నియోజకవర్గంలో పవన్ కల్యాణ్ విసృతంగా పర్యటించారు.
నియోజకవర్గంలో ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించిన పవన్ కల్యాణ్.. స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత తన స్నేహితులతో ఇక్కడ కార్పొరేట్ స్థాయి ఆస్పత్రిని కట్టిస్తానని నియోజకవర్గ ప్రజలకు పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు. ఐదు రోజుల పాటు పిఠాపురంలోనే మకాం వేసిన పవన్ కల్యాణ్ తన గెలుపుకు అనుసరించాల్సిన వ్యూహాల గురించి టీడీపీ నేతలతో చర్చించారు.

అయితే పవన్ కల్యాణ్ తన ప్రచారంలో భాగంగా ఓ ఆటోలో కొద్ది దూరం ప్రయాణించారు. ఆ తరువాత పవన్ కాన్వాయ్ వెళ్తున్న సమయంలో ఎదురుగా వస్తోన్న ఎద్దుల బండ్లను చూసి తన కారును ఆపి మరి కాసేపు వారితో పవన్ కల్యాణ్ ముచ్చటించారు. దీనికి సంబంధించిన వీడియోలను జనసేన సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
అయితే ఈ వీడియోలపై వైసీపీ కార్యకర్తలు, నేతలు తమదైనశైలిలో స్పందిస్తున్నారు. పవన్ కల్యాణ్ ఆటోలో ప్రయాణించిన సందర్భంలో ఎక్కడ రోడ్డు మీద గుంతలు కనిపించలేదని.. జనసేన భారీ ర్యాలీ నిర్వహించిన సందర్భంలో కూడా రోడ్డు అద్భుతంగా ఉందని..ఈ విషయం తాము చెప్పడం లేదని..జనసేన నాయకులు పోస్ట్ చేసిన వీడియోల్లోనే ఇది స్పషంగా కనిపించిందని వైసీపీ కార్యకర్తలు చెబుతున్నారు.

ఎక్కడో ఒకచోట రోడ్లు బాలేకపోతే..దాన్నే భూతద్దంలో టీడీపీ , జనసేన చూపించారు. ఇప్పుడు వారే తమకు అనుకూలంగా వీడియోలను పోస్ట్ చేయడం చాలా ఆనందంగా ఉందంటూ వైసీపీ శ్రేణులు కామెంట్స్ చేస్తున్నారు. పవన్ కల్యాణ్ పిఠాపురం వచ్చి మరి తమకు ప్రచారం చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నారు. మరి వైసీపీ శ్రేణులు చేసిన ఈ కామెంట్స్‌పై జనసేన కార్యకర్తలు ఎలాంటి కౌంటర్ ఎటాక్ ఇస్తారో చూడాలి.












Click it and Unblock the Notifications