భారీ మెజార్టీ దిశగా విక్రమ్ రెడ్డి - 21 వేల ఓట్ల ఆధిక్యతతో : ఏకపక్షంగా..!!

ఆత్మకూరు ఉప ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధి మేకపాటి విక్రమ్ రెడ్డి భారీ మెజార్టీ దిశగా దూసుకెళ్తున్నారు. ఇప్పటి వరకు నాలుగు రౌండ్లు పూర్తి కాగా, ప్రతీ రౌండ్ లోనూ విక్రమ్ రెడ్డి ఆధిక్యత సాధిస్తున్నారు. ప్రతీ రౌండ్ లోనూ విక్రమ్ రెడ్డి ఏకపక్షంగా మెజార్టీ సాధిస్తున్నారు. తొలి రౌండ్ లోనే వైసీపీకి అయిదు వేల ఓట్ల మెజార్టీ దక్కింది. తొలి రౌండ్ లో 5,337 ఓట్ల మెజార్టీ సాధించారు. ఫస్ట్ రౌండ్ లో విక్రమ్ రెడ్డికి 6 వేలకు పైగా ఓట్లు వచ్చాయి. కాగా, బీజేపీ అభ్యర్ధికి 730 ఓట్లు దక్కాయి. రెండో రౌండ్ లో విక్రమ్ రెడ్డి కి 10688 ఓట్లు వచ్చాయి.

బిజెపి అభ్యర్థి భరత్ కుమార్ కు 1508 ఓట్లు దక్కాయి. బీఎస్పీ అభ్యర్థి శ్రీ ఓబులేసు 266 ఓట్లు దక్కించుకున్నారు. దీంతో..రెండో రౌండ్ ముగిసే సరికి విక్రమ్ రెడ్డి మెజార్టీ 9,180గా ఉంది. మూడో రౌండ్ లో విక్రమ్ రెడ్డికి 15582 ఓట్లు వచ్చాయి. బీజేపీకి 2719 ఓట్లు రాగా, బీఎస్పీ అభ్యర్దికి 485 ఓట్లు పోలయ్యాయి. దీంతో..మూడో రౌండ్ ముగిసే సమయానికి వైసీపీ అభ్యర్ధి విక్రమ్ రెడ్డి 12,863 ఓట్ల మెజార్టీలో ఉన్నారు. నాలుగో రౌండ్ లో విక్రమ్ రెడ్డి కి 21043 ఓట్లు దక్కాయి. బీజేపీకి 3658, బీఎస్పీకి 683 ఓట్లు వచ్చాయి. అయితే, నోటా కింద 699 ఓట్లు పోలయ్యాయి.

IN Atmakur by poll counting YSRCP Candidate Mekapati Vikram reddy lead in first three rounds counting.

నాలుగో రౌండ్ పూర్తయ్యే సరికి విక్రమ్ రెడ్డి బీజేపీ పైన 17385 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. అయిదో రౌండ్ పూర్తయ్యే సరికి విక్రమ్ రెడ్డి 21 వేల పైగా మెజార్టీతో దూసుకెళ్తున్నారు. మొత్తం 14 మంది బరిలో నిలవగా..బీజేపీ రెండో స్థానంలో కొనసాగుతోంది. 14 టేబుళ్ల మీద మొత్తం 20 రౌండ్ల లెక్కింపు జరగనుంది. వైసీపీ అభ్యర్ధి గెలుపు లాంఛనంగా భావిస్తున్నారు. అయితే, వైసీపీ తొలి నుంచి ఇక్కడ లక్ష ఓట్ల లక్ష్యంతో వ్యూహాలు అమలు చేసింది. ఇప్పుడు అయిదో రౌండ్ కు 21 వేల మెజార్టీ రావటంతో..తాము అనుకున్న విధంగా లక్ష ఓట్ల మెజార్టీ వస్తుందనే ధీమా వైసీపీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. కాగా, కౌంటింగ్ హాల్ నుంచి బీజేపీ అభ్యర్ధి భరత్ వెళ్లిపోయారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+