ఆ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోండి ప్లీజ్ : వైసీపీ
ఏపీలో పరిస్ఠితి చూస్తోంటే ప్రతిపక్షాన్ని ఖాళీ చేయాలనే టార్గెట్ పెట్టుకున్నట్టే ఉంది అధికార పక్షం టీడీపీ. ఫిరాయింపులు, ప్రలోభాలు.. ఏపీకి సంబంధించి ఈమధ్య నిత్యం వినిపిస్తున్న వార్తలు. వెళ్ళేవాళ్ళంతా సీఎం చంద్రబాబు నాయుడు చేస్తున్న అభివ్రద్దిని చూసి పార్టీ మారుతున్నామని చెప్తుంటే.. ప్రతిపక్షం వైసీపీ మాత్రం తమ పార్టీ ఎమ్మెల్యేలకు టీడీపీ డబ్బులు ఎరవేస్తోందని ఆరోపిస్తోంది.

కాగా.. వైసీపీ టికెట్ పై గెలిచి పార్టీ గోడ దూకిన నేతలందరిపై వేటు వేయాలని పట్టుబడుతోంది ఆ పార్టీ. ఇదే క్రమంలో టీడీపీలో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ శాసనసభాపతికి వినతిపత్రం అందజేశారు వైసీపీ నేతలు. అసెంబ్లీలో స్పీకర్ కోడెల శివప్రసాదరావును కలిసిన వైసీపీ ఎమ్మెల్యేలు.. పార్టీని వీడి టీడీపీలో చేరిన ఎమ్మెల్యేలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని, ఆయా ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని ఫిర్యాదు చేశారు.












Click it and Unblock the Notifications