తిరుమల లడ్డు కల్తీపై వైసీపీ డిమాండ్.. చంద్రబాబు ఊహించని పరిణామం!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుమలలో లడ్డు కల్తీ వ్యవహారం పైన రగడ ఆగడం లేదు. అధికార ఎన్డీయే కూటమికి వైసీపీ కి మధ్య ప్రచ్చన్న యుద్ధం కొనసాగుతుంది. ఏపీలో తాజాగా తిరుమలలో లడ్డు కల్తీ వ్యవహారం పైన సిట్ ను ఏర్పాటు చేసి విచారణ జరపనున్న క్రమంలో వైసిపి నేతలు చంద్రబాబు రాజకీయం పైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
చంద్రబాబుపై భగ్గుమన్న గుడివాడ అమర్నాథ్
తిరుమల తిరుపతి లడ్డు తయారీలో కల్తీ ఆరోపణల నేపధ్యంలో సీబీఐ దర్యాప్తు చేపట్టాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైతం డిమాండ్ చేస్తుంది. సిబిఐ విచారణకు వెళ్లకుండా చంద్రబాబు సిట్ దర్యాప్తును ఏర్పాటు చేయడం పైన సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చంద్రబాబు వ్యవహార శైలిపైన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాజకీయంగా జగన్ పై కక్ష సాధింపు కోసమే ఈ తరహా కుట్రలు చేస్తున్నారన్నారు.

తన గొయ్యిని తానే తవ్వుకున్నారన్న మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్
తిరుమల శ్రీవారిపై రాజకీయం చేసి చంద్రబాబు తన గొయ్యిని తానే తవ్వుకున్నారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అభిప్రాయపడ్డారు. ఇదే సమయంలో తిరుమల లడ్డు వ్యవహారం పైన తీవ్రమైన ఆరోపణలు చేసిన చంద్రబాబు సిబీఐ విచారణ జరిపించాలని కూడా ఆయన డిమాండ్ చేశారు.
తిరుమల శ్రీవారితో పెట్టుకున్న వారు ఎవరు బాగుపడరు
తిరుమల లడ్డు కల్తీ విషయంలో సిబిఐ విచారణ కోరుతున్నప్పటికీ చంద్రబాబు ఎందుకు సిబిఐ కి కేసును అప్పగించడం లేదని గుడివాడ అమర్నాథ్ ప్రశ్నించారు. రాజకీయాల కోసం పసుపు చొక్కాలు వేసుకునే టిడిపి నేతలు ఇప్పుడు మాత్రం కాషాయ చొక్కాలు వేసుకుంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు. తిరుమల శ్రీవారితో పెట్టుకున్న వారు ఎవరు బాగుపడలేదని, చంద్రబాబు రాజకీయాల కోసం తిరుమల శ్రీవారిని కూడా వాడుకుంటున్నారని గుడివాడ అమర్నాథ్ విమర్శలు గుప్పించారు.
చంద్రబాబు ఏర్పాటు చేసిన సిట్ వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండబోదు
ఏపీలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు చంద్రబాబు లడ్డు వ్యవహారాన్ని తెరమీదికి తెచ్చారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. చంద్రబాబు ఏర్పాటు చేసిన సిట్ వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండబోదని చంద్రబాబు ఎవరి పేర్లు రాయమంటే సిట్ వారి పేర్లు రాస్తుంది అంటూ పేర్కొన్నారు.
దేవుడి మీద రాజకీయం చేయడం మీకే చెల్లింది
ఇక లడ్డు విషయంపైన విచారణ జరిపించాలని ప్రధాని నరేంద్ర మోడీకి కూడా వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే లేఖ రాసారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ గుర్తు చేశారు. దేవుడి మీద రాజకీయం చేయడం మీకే చెల్లిందని సిబిఐ విచారణ కాకుండా సిట్ విచారణకు వేసినప్పుడే మీ అసలు బండారం బయటపడిందని గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యలు చేశారు.












Click it and Unblock the Notifications