వాటిపై టీడీపీ యూటర్న్.. జగన్ బాటలోనే చంద్రబాబు
జగన్ ప్రభుత్వంలో విద్య, వైద్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చారని, చంద్రబాబు సర్కార్ అధికారంలోకి వచ్చాక వైద్య రంగాన్ని గాలికి వదిలేశారని, ప్రజల ప్రాణాలను గాలిలో పెట్టారని మండిపడ్డారు నందిగామ వైసీపీ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్‌మోహన్‌రావు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడిన ఆయన ప్రతి ఒక్కరికీ ఉచిత వైద్యం కోసం జగన్ పని చేశారన్నారు.
చంద్రబాబుపై మండిపడిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే
చంద్రబాబు తన హయాంలో ఒక్కటంటే ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీ కూడా ఏర్పాటు చేయలేదని మండిపడ్డారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ద్వారా ప్రజారోగ్యాన్ని మెరుగు పరచాలని ఆనాడు సీఎం వైయస్ జగన్ ఆశించారని, కానీ, ఆయన మెడికల్ సీట్లు అమ్ముకుంటున్నారంటూ.. అప్పట్లో టీడీపీ నేతలు తీవ్ర ఆరోపణలు చేశారని మండిపడ్డారు.

పేమెంట్ సీట్లపై టీడీపీ యూటర్న్
అధికారంలోకి వచ్చిన తరవాత, టీడీపీ నేతలు యూటర్న్ తీసుకున్నారు. పేమెంట్ సీట్లు రద్దు చేయబోమని, వాటని కొనసాగిస్తామని ఏకంగా హైకోర్టులోనే నివేదించారు అంటే, వారిప్పుడు జగన్ బాటలోనే నడుస్తున్నారన్నారు. ఐదు మెడికల్ కాలేజీలకు సీట్ల కేటాయింపు జరగకపోతే, ఈ ఏడాది నుంచి వాటిలో అడ్మిషన్లు అనుమతించకపోతే, చంద్రబాబు ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు.వైయస్ జగన్ మొదలు పెట్టిన కాలేజీలన్న కారణంతోనే వాటిని పట్టించుకోవడం లేదా?
ప్రజల ఆరోగ్య సమస్యలు ప్రభుత్వానికి పట్టవా
రాష్ట్రంలో ఇప్పుడు డయేరియా విపరీతంగా పెరిగింది. రక్షిత మంచినీటిని కూడా సరఫరా చేయలేక పోతున్నారని ఆరోపించారు. ప్రజలు అనారోగ్యానికి గురై అల్లాడుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోంది? అని ప్రశ్నించారు. వైసీపి కార్యకర్తలను వేధించటం మీద ఉన్న దృష్టి ప్రజారోగ్యంపై లేదని మండిపడ్డారు. ప్రజల అరోగ్య సమస్యలు ప్రభుత్వానికి పట్టవా? అంటూ నిలదీశారు.
జగన్ నియమించిన స్పెషలిస్టు డాక్టర్లను చంద్రబాబు తొలగించారు
ప్రభుత్వ చేతగానితనం వలనే రాష్ట్రంలో డయేరియా పెరిగిందని, నాటికీ , నేటికీ ఎంతో తేడా ఉందన్నారు. వైయస్ జగన్ పాలనలో వైద్య రంగం ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చెక్ చేసుకోవాలన్నారు. వైయస్ జగన్, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తెస్తే.. ఇప్పుడు దాని ఊసే కనపడటం లేదన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో స్పెషలిస్టు డాక్టర్లను నాడు సీఎం వైయస్ జగన్ నియమిస్తే, చంద్రబాబు ఇప్పుడు వారిని తొలగించేశారని మండిపడ్డారు.












Click it and Unblock the Notifications