Bengaluru Rave Party: రాజకీయం చేస్తున్న వైసీపీ, ఆ పార్టీ నాయకులు కింగ్ పిన్ !
ఐటీ హబ్ బెంగళూరు సిటీలో జరిగిన రేవ్ పార్టీ ఇప్పుడు మూడు నాలుగు రాష్ట్రాలను కుదిపేస్తోంది. బెంగళూరు నగరంలోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో జరిగిన రేవ్ పార్టీలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడుకు చెందిన వ్యక్తులు పాల్గొన్నారని తెలిసింది. ఇప్పుడు బెంగళూరు సిటీలో జరిగిన రేవ్ పార్టీని ఆంధ్రప్రదేశ్ లోని వైసీపీ నాయకులు రాజకీయం చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది.
బెంగళూరు నగరంలో జరిగిన రేవ్ పార్టీపై పంజా విసిరిన ఎలక్ట్రానిక్ సిటీ పోలీసులు కొందరిని అదుపులోకి తీసుకుని ఐదుగురిని అరెస్టు చేశారు. రేవ్ పార్టీ నిర్వహించిన ఐదు మంది ప్రధాన నిందితులను అరెస్టు చేశామని బెంగళూరు సిటీ పోలీసు కమీషనర్ దయానంద్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. బెంగళూరులో రేవ్ పార్టీ నిర్వహించిన ఐదు మంది నిందితుల ఫోటోలను బెంగళూరు పోలీసులు మీడియాకు విడుదల చేశారు.

బెంగళూరు రేవ్ పార్టీ నిర్వహించారని ఆరోపిస్తూ మొహ్మద్ అబూబక్కర్ సిద్దికి, ఎల్ వాసు, డి నాగబాబు, రణధీర్ విక్రమ్ అలియాస్ రణదీర్ విక్రమ్ నాయుడు, అరుణ్ కుమార్ అలియాస్ అరుణ్ కుమార్ నాయుడు అనే వ్యక్తులు ఉన్నారు. బెంగళూరు రేవ్ పార్టీ నిందితుల ఫోటోలు బయటకు రావడంతో రెండు మూడు రోజులు వాటి గురించి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలు పెద్దగా పట్టించుకోలేదు.
ఎందుకంటే బెంగళూరు రేవ్ పార్టీలో నటి హేమా చిక్కిందని వెలుగు చూడటంతో తెలుగు ప్రజలు ఫోకస్ మొత్తం నటి హేమా మీద పెట్టారు. అయితే ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న వైసీపీ నాయకులు మాత్రం బెంగళూరు పోలీసులు అరెస్టు చేసిన ఐదు మంది నిందితుల ఫోటోల మీద ఫోకస్ పెట్టి అసలు మ్యాటర్ బయటకు లాగడం మొదలుపెట్టారు. బెంగళూరు రేవ్ పార్టీలో చిత్తూరు జిల్లాకు చెందిన టీడీపీ నాయకులు ఉన్నారని వైసీపీ ఆరోపించడం మొదలుపెట్టింది.

బెంగళూరు పోలీసులు అరెస్టు చేసిన రణధీర్ విక్రమ్ నాయకుడు చిత్తూరుకు చెందిన టీడీపీ యువనేత అని, అరుణ్ కుమార్ నాయుడు కాణిపాకం సమీపంలోని మద్దిపట్లపల్లె నివాసి అని, అతను టీడీపీ కార్యకర్త అని వైసీపీ నాయకులు ఆరోపించారు. చిత్తూరు నగరానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకులతో రణధీర్ విక్రమ్ నాయుడికి చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయని వైసీపీ నాయకులు ఆరోపించారు.
బెంగళూరు రేవ్ పార్టీకి హాజరు అయిన వారి నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేశారని, వాసు బర్త్ డే పార్టీ పేరుతో నిర్వహించిన రేవ్ పార్టీకి సన్ సెట్ టు సన్ రైస్ పార్టీ అని పేరు పెట్టారని బెంగళూరు పోలీసులు అంటున్నారు. రేవ్ పార్టీకి హాజరైన ఒక్కొక్కరి నుంచి రూ. 2 లక్షల నుంచి రూ. 3 లక్షలు వసూలు చేశారని ఆరోపణలు ఉన్నాయి. బెంగళూరు రేవ్ పార్టీలో సుమారు 250 మందికి కంటే ఎక్కువ మంది పాల్గొన్నారని, అందులోని 101 మంది వివరాలు తెలిశాయని బెంగళూరు సిటీ క్రైమ్ బ్రాంచ్ పోలీసు (సీసీబీ) అధికారులు అంటున్నారు.
-
SRH.. ఏదో తేడాగా ఉందేంటీ -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్డే గిఫ్ట్ మామూలుగా లేదుగా!












Click it and Unblock the Notifications