నెల్లూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

34 ఏళ్లే...అయినా నాన్న స్పీడ్‌ అందుకోలేకపోతున్నా...నా లాంటి యువకుడిని ప్రోత్సహించాలి:లోకేష్

By Suvarnaraju
|
Google Oneindia TeluguNews

నెల్లూరు:ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తనయుడు, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ప్రసంగంపై తాజాగా చేసిన ప్రసంగంపై వైసిపి, జనసేన మద్దతుదారులు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు.

నారా లోకేష్ ఒకే వేదిక మీద చేసిన ఒకే ప్రసంగంలో పరస్పరం భిన్నంగా ఉండే వ్యాఖ్యలు చేశారంటూ...కావాలంటే మీరే చూడండంటూ సోషల్ మీడియాలో ఆ వ్యాఖ్యలను ఊటంకిస్తూ వ్యంగ్య వ్యాఖ్యలు చేస్తున్నారు. ఒకవైపు 34 ఏళ్ల వయసులోనే తండ్రి చంద్రబాబు స్పీడ్ అందుకోలేకపోతున్నానంటూ...మరోవైపు అతిచిన్న వయస్సులోనే మంత్రి అయి ఎంతో అభివృద్ది చేస్తున్నానని, జగన్, పవన్ కు చేతనైతే తన లాంటి యువతను ప్రోత్సాహించాలని లోకేష్ చెప్పటం విచిత్రంగా ఉందని ఎద్దేవా చేస్తున్నారు.

‘దళిత తేజం'లో...లోకేష్ వ్యాఖ్యలు

‘దళిత తేజం'లో...లోకేష్ వ్యాఖ్యలు

నెల్లూరులో జరిగిన ‘దళిత తేజం' ముగింపు సభలో పాల్గొన్న మంత్రి నారా లోకేష్ తన ప్రసంగంలో అటు కేంద్రాన్ని, ఇటు వైసిపిని, మరోవైపు పవన్ కళ్యాణ్ పై విమర్శల వర్షం కురిపించారు. ఎపి అభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంతగానో కష్టపడుతున్నారని, భావితరాల భవిష్యత్తు కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారని మంత్రి నారా లోకేశ్‌ అన్నారు. అయితే ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ చేసిన కొన్ని వ్యాఖ్యలు పరస్పరం భిన్నంగా ఉన్నాయని, అవి లోకేష్ ప్రసంగంలో అపరిపక్వతను సూచిస్తున్నాయని ఎద్దేవా చేస్తున్నారు.

నా వయస్సు 34 ఏళ్లే...అయినా

నా వయస్సు 34 ఏళ్లే...అయినా

‘‘నా వయస్సు 34 ఏళ్లు ఇంకా చంద్రబాబు స్పీడ్‌ అందుకోలేకపోతున్నా....69 ఏళ్ల వయస్సులో అంతగా కష్టపడుతున్న ఆ వ్యక్తిని అభినందించి ప్రోత్సహించాల్సింది పోయి ఆయనపై అనేక ఆరోపణలు చేయడం బాధాకరం....మచ్చలేని చంద్రన్నపై ఆరోపణలు చేస్తే ఏమనుకోవాలి. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సింది కేంద్రం... ఏపీలో అవినీతి పుత్రుడు జగన్‌, ఇటువైపు పవన్‌ చంద్రబాబుపై విమర్శలు చేస్తున్నారు...ఇదేం న్యాయం?...మీకు దమ్ము ఉంటే పాదయాత్ర, కవాతు కేంద్రం ముందు చేయండి తప్ప చంద్రన్న ముందు కాదు. పవర్‌స్టార్‌ ‌ పవర్‌ఫుల్‌గా కేంద్రాన్ని తిరస్కరిస్తారనుకుంటే ఈ రోజు ఆయన చంద్రన్నపై ఆరోపణలు చేస్తున్నారు. మేం తప్పుచేసి ఉంటే సాక్ష్యాధారాలతో సహా ప్రజల ముందు పెట్టండి తప్ప అర్థంపర్థంలేని ఆరోపణలు చేయొద్దు"...అన్నారు. లోకేష్ ఇటీవలికాలంలో వివిధ సందర్భాల్లో తన తండ్రి స్పీడ్ అందుకోలేకపోతున్నానని వ్యాఖ్యలు చేసిన విషయాన్ని ప్రత్యర్థులు గుర్తు చేస్తున్నారు.

మరోవైపు...యువకుడిగా ప్రోత్సాహం కోరడంపై

మరోవైపు...యువకుడిగా ప్రోత్సాహం కోరడంపై

అయితే లోకేష్ తన ప్రసంగం కొనసాగిస్తూ "నేను పుట్టిన నాటికే మా తాత సీఎం...నిక్కరు వేసుకొని బడికి వెళ్లే సమయానికి మా నాన్న సీఎం...అయినా ఏ రోజూ నాపై ఒక్క అవినీతి ఆరోపణ రాలేదు...అతి చిన్న వయస్సులో పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి మంత్రి అయ్యా...యువతపై మీకు బాధ, బాధ్యత ఉంటే నాలాంటి యువకుల్ని ప్రోత్సహించాలి...తప్పులు ఉండే ఎత్తి చూపాలి...మీరు అలా చేయడంలేదు. ఇంకో 40 ఏళ్లు నేను రాష్ట్ర రాజకీయాల్లో ఉంటా. మా తాత, నాన్నకు ఏ రోజూ చెడ్డపేరు తీసుకురానని హామీ ఇస్తున్నా.

 అయితే...ఇవే తప్పులు అంటున్నారు...

అయితే...ఇవే తప్పులు అంటున్నారు...

34 ఏళ్ల వయసులో ఉండి 69 ఏళ్ల తండ్రి స్పీడ్ అందుకోలేక పోతున్నానని పదే పదే చెబుతున్న లోకేష్...మరి తన లాంటి యువతను ప్రోత్సహించాలని ఎలా చెబుతారని సోషల్ మీడియాలో వైసిపి,జనసేన మద్దతుదారులు ప్రశ్నిస్తున్నారు. తండ్రి సిఎం కావడంతో దొడ్డిదారిన మంత్రి అయిన లోకేష్ అది తన ఘనతగా ఎలా చెబుతారని, కనీసం చిన్న వయసులో ఎమ్మెల్యేగా గెలిచి అప్పుడు మంత్రి అయినా ఆ విధంగా గొప్పలు చెప్పుకున్నా కొంచెమన్నా అర్థవంతంగా ఉంటుందని విమర్శిస్తున్నారు.

మరికొన్ని...విమర్శనాస్త్రాలు

మరికొన్ని...విమర్శనాస్త్రాలు

ఒకవైపు నిక్కరు వేసుకున్నప్పుడే తండ్రి సిఎం అంటూనే తన మీద విమర్శలు రాలేదంటున్నారని, ఆ వయసులో బాలుడిపై విమర్శలు ఎలా వస్తాయంటున్నారు.
ఇక ఇప్పుడు రాజకీయాల్లో అడుగుపెట్టిన నాటినుంచే లోకేష్ పై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయని, విమర్శలు రాలేదని చెప్పుకోవడం పిల్లి కళ్లు మూసుకొని పాలు తాగుతూ తననెవరూ చూడలేదనుకుంటున్న చందంగా ఉన్నాయని ఎద్దేవా చేస్తున్నారు. లోకేష్ అక్రమాలు అన్నీ బైటపడే రోజు త్వరలోనే వస్తుందని దుయ్యబట్టారు.ఇక మీ కులం, మతం, ప్రాంతం ఏదని అడిగితే ఆంధ్ర అని చెప్పండి అంటూ లోకేశ్‌ తన ప్రసంగంలో పేర్కొనడం మరీ టూమచ్ అని...లోకేష్ మరీ వాస్తవానికి దూరంగా ఆలోచిస్తున్నారని అర్థమవుతోందని వ్యాఖ్యానించారు.

English summary
YCP and Pawan Kalyan's supporters are criticizing over Nara Lokesh latest speech at 'Dalitha tejam' meeting.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X