వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్ర‌బాబు సైలెంట్‌: సొంత నియోజ‌క‌వ‌ర్గంలోనే వెనక్కు-ముందుకు: రెండు చోట్ల ప‌వ‌న్ ఎదురీత‌..!

|
Google Oneindia TeluguNews

సైలెంట్ ఓటింగ్‌..అండ‌ర్ క‌రెంట్‌..మీకు అర్దం కాదు..టీడీపీ విజ‌యాన్ని ఎవ‌రూ ఆప‌లేరు.. ఇదీ..టీడీపీ అధినేత‌.. ఏపీ ముఖ్య‌మంత్రి చంద్రబాబు గ‌త 40 రోజులుగా ప‌దే ప‌దే చెబుతున్న మాట‌. ఓట‌ర్ల నాడి ప‌ట్టుకోవటంలో ఎగ్జిట్ పోల్స్ చేసిన సంస్థ‌లు విఫ‌ల‌య్యాయ‌ని విమ‌ర్శించారు. కానీ, అస‌లు ఫ‌లితాల్లో మాత్రం టీడీపీ అధినేత సైలెంట్ అయ్యారు. మాకు కాక‌పోతే జ‌గ‌న్‌కు ఎందుకు ఓట్లు వేస్తారు అని ప్ర‌శ్నించిన చంద్ర‌బాబుకు ఫ‌లితాలే స‌మాధానం చెబుతున్నాయి. కుప్పం మోడ‌ల్ గెలుపు అంద‌రికీ ఆద‌ర్శం కావాల‌ని చెప్పిన చంద్ర‌బాబుకు..ఆయ‌న పోటీ చేసిన సొంత నియోజ‌క‌వ‌ర్గంలో వెన‌క్కు-ముందుకు మెజార్టీ ఊగిస‌లాడుతోంది.

కుప్పంలో వెన‌క్కు..ముందుకు

ప్ర‌తీ టీడీపీ స‌మావేశంలో కుప్పంలో తాను కాలు పెట్ట‌క‌పోయినా..75 వేల‌కు పైగా మెజార్టీ సాధిస్తున్నామ‌ని చంద్ర‌బాబు చెప్పుకొచ్చారు. అది అంద‌రికీ మోడ‌ల్ కావాలని సూచించారు. అయ‌తే, కుప్పంలో చంద్ర‌బాబు 357 ఓట్ల వెనుక‌బ‌డి.. ఆ త‌రువాత 1500 ఓట్ల మెజార్టీలో ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జ‌గ‌న్ సునామీ క‌నిపిస్తోంది. ఇప్ప‌టికే వైసీపీ 122 సీట్ల ఆధిక్యంలో ఉండ‌గా..టీడీపీ కేవ‌లం 29 స్థానాల్లో ఆధిక్య‌త‌లో ఉన్నారు. దాదాపు మంత్రులంతా వెనుక‌బ‌డి ఉన్నారు. లోకేశ్ పోటీ చేస్తున్న మంగ‌ళ‌గిరిలో ఆధిక్య‌త వైసీపీ..టీడీపీ మ‌ధ్య అధిక్య‌త దోబుచులాట ఆడుతోంది. చంద్ర‌బాబు న‌మ్ముకున్న ప‌సుపు-కుంకుమ వ‌ర్క‌వుట్ కాలేదు. ఎన్నిక‌ల వేళ దాదాపు 30 వేల కోట్ల‌తో సంక్షేమ ఫ‌లాలు అందించామ‌ని.. అవే త‌మ‌ను గెలిపిస్తాయ‌ని ఆశించారు. కానీ, అవ‌న్నీ రివ‌ర్స్ అయ్యాయి.

YCP lead in above 130 seats..Chandra babu also facing tough situation in Kuppam

రెండు చోట్ల ప‌వ‌న్ ఎదురీత‌..
జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ పోటీ చేసిన రెండు చోట్ల వెనుక‌బ‌డి ఉన్నారు. భీమ‌వ‌రం..గాజువాక‌ల్లో ప‌వ‌న్ క‌ళ్యాన్ మీద వైసీపీ అభ్య‌ర్దులు ఆధిక్య‌త‌తో ఉన్నారు. ఆయ‌న సోద‌రుడు నాగ‌బాబు న‌ర్సాపురం లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గంలో వెనుక బ‌డి ఉన్నారు. గాజ‌వాక‌, మ‌మ్మ‌డి వ‌రంలో మాత్ర‌మే జ‌న‌సేన అభ్య‌ర్దులు కొంత ప్ర‌భావం చూపించారు. ఇక‌, ఇప్పుడు వైసీపీ నేత‌లు సంబ‌రాల్లో మునిగి పోయారు. సాయంత్రానికి తుది ఫ‌లితాలు వ‌చ్చిన త‌రువాత అధినేత‌లు అధికారికంగా స్పందించే అవ‌కాశం ఉంది.

English summary
Chandra Babu train and recovered in 3rd round in Kuppam. Over all in AP YCP lead in above 120 seats. Pawan Kalyan t rail in Bhimavaram and Gajuwaka.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X