వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ మాజీ మంత్రికి టికెట్ క‌ష్ట‌మే.. టీడీపీ వైపు చూపు.. నియోజ‌క‌వ‌ర్గం ఖ‌రారు??

|
Google Oneindia TeluguNews

ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి రాజ‌కీయాల్లో సీనియ‌ర్. ఊహ తెలిసిన‌ప్ప‌టి నుంచి రాజ‌కీయాలే లోకంగా బ‌తికారు. ఆయ‌న‌కు తోడు ఆయ‌న సోద‌రుడు వివేకానంద‌రెడ్డి కూడా ఉండ‌టంతో మంచి రాజ‌కీయ నేత‌లుగా పెరు తెచ్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న స‌మ‌యంలో, వైఎస్ ముఖ్య‌మంత్రిగా అధికారం చెలాయించిన‌ప్పుడు వారి హ‌వా ఉమ్మ‌డి నెల్లూరు జిల్లాలో ఒక రేంజ్‌లో సాగింది. రాష్ట్రాన్ని విభ‌జించిన త‌ర్వాత క్ర‌మేణా వారి రాజ‌కీయ ఆధిప‌త్యానికి గండి ప‌డుతూ వ‌స్తోంది. ఈలోగా వివేకానంద‌రెడ్డి మృతిచెందారు.

టీడీపీ నుంచి వైసీపీలోకి..

టీడీపీ నుంచి వైసీపీలోకి..


సుదీర్ఘ‌కాలం ప్రాతినిధ్యం వ‌హించిన కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో భ‌విష్య‌త్తు లేద‌ని భావించి బాధాత‌ప్త హృద‌యంతో ఆనం ఆ పార్టీకి వీడ్కోలు ప‌లికారు. తెలుగుదేశం పార్టీలో చేరారు. అయితే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి విజ్ఞ‌ప్తి మేర‌కు వైసీపీ తీర్థం పుచ్చుకొని 2019 ఎన్నికల్లో ఉమ్మ‌డి నెల్లూరు జిల్లా వెంక‌ట‌గిరి నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీచేశారు. కానీ ప‌లు శాఖ‌లకు మంత్రిగా చేసిన‌ప్ప‌టికీ త‌న‌కివ్వాల్సిన గౌర‌వంకానీ, మ‌ర్యాద‌కానీ ఇవ్వ‌డంలేద‌ని భావించిన ఆయ‌న అల‌క బూనారు.

ప్రభుత్వ నిర్ణయాలకు బహిరంగంగానే వ్యతిరేకం

ప్రభుత్వ నిర్ణయాలకు బహిరంగంగానే వ్యతిరేకం


ప్ర‌భుత్వం ప‌ట్టించుకోలేదు. జిల్లాల విభ‌జ‌న స‌మ‌యంలో కూడా ప్ర‌భుత్వ నిర్ణ‌యాల‌ను వ్య‌తిరేకించ‌డ‌మే కాకుండా మ‌రికొన్ని నిర్ణ‌యాల‌ను కూడా బ‌హిరంగంగానే ఆనం త‌ప్పుపట్టారు. దాదాపుగా ఆయ‌న వైసీపీలో ఉండ‌రంటూ రాజ‌కీయ విశ్లేష‌కులు అంచ‌నా వేశారు. ఇటీవ‌ల వైసీపీ నిర్వ‌హించుకున్న స‌ర్వేల్లో వెంక‌ట‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలో కూడా మార్పులు చేయాల‌ని, లేదంటే అక్క‌డ గెల‌వ‌డం క‌ష్ట‌మంటూ నివేదిక వ‌చ్చింది. దీంతో రెండోసారి అధికారంలోకి రావ‌డానికి క‌ఠిన‌మైన నిర్ణ‌యాలు తీసుకుంటాన‌న్న జ‌గ‌న్ ఆయ‌న‌కు టికెట్ నిరాక‌రించే అవ‌కాశం ఉంద‌ని రాజ‌కీయ వ‌ర్గాలు భావిస్తున్నాయి.

ఆత్మకూరు నుంచి రంగం సిద్ధం చేసుకుంటున్నారు?

ఆత్మకూరు నుంచి రంగం సిద్ధం చేసుకుంటున్నారు?


అంత‌క‌న్నా ముందే తాను పార్టీ నుంచి త‌ప్పుకోవాల‌నే యోచ‌న‌లో ఉన్న‌ట్లు ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి అనుచ‌రులు చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీవైపు చూస్తున్న ఆనం రానున్న ఎన్నిక‌ల్లో ఆత్మ‌కూరు నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీచేయ‌డానికి ఆస‌క్తి చూపిస్తున్నారు. రాజ‌కీయంగా ఆనం కుటుంబానికి పునాది ప‌డిందే ఆత్మ‌కూరు నియోజ‌క‌వ‌ర్గంలో. అక్క‌డ బ‌లం ఎక్కువ‌గా ఉండ‌టంతో ఆయ‌న అక్క‌డినుంచి పోటీచేయ‌డానికి ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఇవ‌న్నీ ఫ‌లిస్తాయా? లేదా? అంటే కొంత‌కాలం వేచిచూడ‌క త‌ప్పేలా లేదు.!!

English summary
In the recent surveys conducted by YCP, there was a report that changes should be made in Venkatagiri constituency as well, otherwise it will be difficult to win there.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X