కీలక నియోజకవర్గంలో టీడీపీలోకి వైసీపీ సీనియర్ నేత ..!?

కర్నూలు జిల్లాలో సీనియర్ నేత తిరిగి టీడీపీలోకి ఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్దమైంది.

ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. పార్టీ జంపింగ్ లు ఊపందుకున్నాయి. నెల్లూరు జిల్లాల్లో ఇద్దరు అధికార పార్టీ ఎమ్మెల్యేలు దూరయమయ్యారు. టీడీపీలోకి వెళ్తున్నారనే ప్రచారం సాగుతోంది. మైలవరంలోనూ ఇటువంటి ప్రచారమే కొనసాగినా..సీఎం జగన్ జోక్యంతో వివాదం సమిసిపోయింది.

ఇప్పుడు కర్నూలు జిల్లాలో సీనియర్ల పార్టీ మార్పు పైన చర్చ మొదలైంది. నంద్యాల జిల్లా బనగాన పల్లె నియోజకవర్గంలో కొద్ది రోజులుగా అధికార పార్టీ నేతల మధ్య విభేదాలు బయటకు వస్తున్నాయి. 2019 ఎన్నికల సమయంలో పార్టీలో చేరిన సీనియర్ నేత..మాజీ ఎమ్మెల్యే బిజ్జం పార్ధసారథి రెడ్డి ఇప్పుడు తిరిగి టీడీపీ లోకి వెళ్లే ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది.

వైసీపీలోనే ఉన్నా..దూరంగా

వైసీపీలోనే ఉన్నా..దూరంగా

కర్నూలు జిల్లా వైసీపీకి కంచుకోటగా ఉంది. 2019 ఎన్నికల్లో జిల్లాలో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. అన్ని స్థానాలు దక్కించుకుంది. జిల్లాలోని బనగానిపల్లి నియోజకవర్గంలో సమీకరణాలు మారుతున్నాయి. ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి.. చల్లా కుటుంబాలతో ఉన్న అంతర్గత విభేదాల కారణంగా సీనియర్ నేత బిజ్జం పార్ధసారథి రెడ్డి కొంత కాలంగా పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారు.

సొంత మండలం అవుకులో నిర్వహించిన పార్టీ సమావేశానికి ఆయన దూరంగానే ఉన్నారు. అదే సమయంలో పార్టీ కీలకంగా భావిస్తున్న గృహసారధుల ఎంపికకు సంబంధించి బిజ్జం స్వగ్రామం చెన్నంపల్లె నుంచి జాబితా ఇవ్వకపోవటం తో ఇప్పుడు అసలు బిజ్జం పార్టీలో కొనసాగుతున్నారా..లేక మార్పు ఆలోచన చేస్తున్నారా అనే చర్చ మొదలైంది.

టీడీపీలోకి రీ ఎంట్రీ ఇస్తారా

టీడీపీలోకి రీ ఎంట్రీ ఇస్తారా

బిజ్జం పార్థసారధి రెడ్డి ..కాటసాని కుటుంబానికి దశాబ్దాల కాలంగా వైరం ఉంది. టీడీపీలో బిజ్జం క్రియాశీలకంగా వ్యవహరించారు. 1999లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పాణ్యం నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్‌ అభ్యర్థి కాటసాని రాంభూపాల్‌ రెడ్డి పై 21,246 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

2004లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్‌ అభ్యర్థి కాటసాని రాంభూపాల్‌ రెడ్డి చేతిలో 4592 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆ ఓటమి తరువాత రాజకీయాలకు దూరంగా ఉంటూ తన వ్యాపారాలు చూసుకుంటూ ఉండి, 2019లో తిరిగి రాజకీయాల్లోకి వచ్చి 4 ఏప్రిల్ 2019న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. నియోజకవర్గంలో కొంత కాలం క్రితం వరకూ బిజ్జం పార్టీ వ్యవహారాల్లో క్రియాశీలకంగానే వ్యవహరించారు.

వైసీపీ నాయకత్వం ఏం చేయబోతోంది

వైసీపీ నాయకత్వం ఏం చేయబోతోంది

బిజ్జం తిరిగి టీడీపీలోకి వెళ్లేందుకు రంగం సిద్దం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. నియోజకవర్గంలో వైసీపీ నేతలతో కొనసాగే పరిస్థితులు కనిపించటం లేదు. బిజ్జం తిరిగి టీడీపీలోకి వెళ్లాలని నిర్ణయించారని అనుచర వర్గం చెబుతోంది. ఉగాది తరువాత ఆయన టీడీపీలో చేరే అవకాశం ఉందని సమాచారం. బనగానపల్లె టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్ధన్ రెడ్డికి బిజ్జం బంధువు.

నియోజకవర్గంలో మారుతున్న సమీకరణాలతో వైసీపీ అధినాయకత్వం ఫోకస్ చేసినట్లుగా తెలుస్తోంది. జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో పార్టీ పరంగా తక్షణం చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. దీంతో.. ఇప్పుడు బిజ్జం తిరిగి టీడీపీలోకి వెళ్లాలని భావిస్తున్న వేళ..వైసీపీ నాయకత్వం ఏం చేయబోతోందనేది ఆసక్తికరంగా మారుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+