బొత్సకు బొమ్మ చూపించిన విజయవాడ ప్రజలు, చేతకాకపొతే ఎందుకు వచ్చారో చెప్పండి

ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నాయకుడు, ఆ పార్టీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణకు వరద బాధితులు సినిమా చూపించారు. విజయవాడలో వరద బాధితులను పరామర్శించడానికి బుధవారం సాయంత్రం వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అక్కడికి వెళ్లారు. ఆ సమయంలో మేము బతికే ఉన్నామా, లేదా అని చూడడానికి ఇక్కడికి వచ్చారా అంటూ వరద బాధితులు మాజీ మంత్రి బొత్ప సత్యనారాయణను నిలదీశారు.

ఇక్కడి ప్రాంతాలు మునిగిపోయి ఐదు రోజులు అయ్యిందని, ఆ రోజు నుండి మేము అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, అయినా మీ పార్టీ నాయకులు ఏమాత్రం పట్టించుకోలేదని, వైసీపీ నాయకులు ఒక్కరు కూడా ఇక్కడికి రాలేదని, ఇప్పుడు మీరు ఊపుకుంటూ ఇక్కడికి వచ్చారా అంటూ వరద బాధితులు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణను నిలదీశారు. విజయవాడలోని రాజరాజేశ్వరి పేటలోని వరద బాధితులను పరామర్శించడానికి మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఇక్కడ పర్యటించడానికి ప్రయత్నించారు.

YCP leader Botsa Satyanarayana s visit to the flooded areas of Vijayawada was blocked by locals

ఈ ప్రాంతాల్లోని ఇండ్లు మునిగిపోయి ఐదు రోజులు అయ్యిందని, ఇన్ని రోజుల తరువాత ఇప్పుడు మ్మల్ని ఎందుకు పరామర్శించడానికి వచ్చారంటూ రాజరాజేశ్వరి పేట ప్రజలు వైసీపీ నాయకుడు బొత్స సత్యనారాయణను స్థానిక ప్రజలు నిలదీశారు. కూటమి ప్రభుత్వం అందిస్తున్న సహాయక చర్యలకు మీ వైసీపీ నాయకులు అడ్డుపడుతున్నారని, ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చారా అంటూ రాజరాజేశ్వరి పేట ప్రజలు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణపై మండిపడ్డారు.

మేము ఇప్పుడు అధికారంలో లేమని, నేను మీకు ఏం సహాయం చేయగలను అంటూ మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ వరద బాధితుల ముందు విచారం వ్యక్తం చేశారు. ఎలాంటి సహాయం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్న మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు అంటూ వరద ప్రాంతాల్లోని స్థానిక ప్రజలు ప్రశ్నించడంతో వారికి ఏం సమాధానం చెప్పలేక వైసీపీ నాయకులడు బొత్స సత్యనారాయణ అక్కడి నుండి చిన్నగా వెళ్ళిపోయారు.

YCP leader Botsa Satyanarayana s visit to the flooded areas of Vijayawada was blocked by locals

విజయవాడలో వరదలు ముంచెత్తడంతో కూటమి ప్రభుత్వం పైన వైసీపీ నాయకులు ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇదే సమయంలో విజయవాడలోని వరద బాధితులకు సహాయ సహకారాలు అందకుండా వైసీపీ నాయకులు అడ్డుపడుతున్నారని టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు ఆరోపణలు చేస్తున్నారు. మొత్తం మీద విజయవాడలో వరద బాధితుల నుంచి నిరసన సెగ వ్యక్తం కావడంతో వైసీపీ నాయకుడు బొత్స సత్యనారాయణ వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోవడం హాట్ టాపిక్ అమంమింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+