వైసీపీ నేత కేతిరెడ్డి సంచలన నిర్ణయం, ధర్మవరంలో ఇక..!!
ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వైసీపీ లక్ష్యంగా కూటమి నేతలు కొత్త వ్యూహాలు చేస్తున్నాయి. కూటమి అధికారంలోకి వచ్చి 18 నెలలు పూర్తి కావటంతో మాజీ సీఎం జగన్ ప్రభుత్వ నిర్ణయాల పైన పోరాటానికి సిద్దం అవుతున్నారు. ఈ నెలాఖరు నుంచి వరుసగా జిల్లాల పర్యటనలకు సిద్దం అవుతున్నారు. ఇదే సమయంలో వైసీపీ నేతలు తిరిగి యాక్టివ్ అవుతు న్నారు. అందులో భాగంగా ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి కీలక నిర్ణయం ప్రకటించారు.
రాయలసీమ కేంద్రంగా రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి. ఉమ్మడి అనంతపురం జిల్లాలో రాజకీయం వేడెక్కుతోంది. ఇప్పుడు ధర్మవరం లోనూ తిరిగి రాజకీయంగా వైసీపీ యాక్టివ్ అయ్యే కార్యాచరణ ఖరారు చేస్తున్నారు. వైసీపీ నేత.. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. 2009 లో కాంగ్రెస్ నుంచి తొలి సారి ఎమ్మెల్యేగా గెలిచిన కేతిరెడ్డి 2014లో ఓడిపోయారు. తిరిగి 2019 లో వైసీపీ నుంచి మరో సారి విజయం సాధించారు.

ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో గుడ్ మార్నింగ్ ధర్మవరం అంటూ కొత్త కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు దగ్గరయ్యారు. ఎన్నికల సమయం వరకు కొనసాగించిన కేతిరెడ్డికి.. ఈ ప్రోగ్రాం మంచి ఇమేజ్ తెచ్చి పెట్టింది. దీంతో, తిరిగి కేతిరెడ్డి విజయం ఖాయమనే చర్చ జరిగింది. అయితే.. 2024 ఎన్నికల్లో కేతిరెడ్డి ఓడిపోయారు.
కూటమి అభ్యర్ధిగా బీజేపీ నుంచి పోటీ చేసిన సత్యకుమార్ విజయం సాధించారు.కేవలం 3,734 ఓట్లతో కేతిరెడ్డి ఓడిపోపోయారు. గెలిచిన సత్యకుమారం మంత్రి అయ్యారు. కాగా..ఎన్నికల ఫలి తాల తరువాత కేతిరెడ్డి చేసిన కొన్ని వ్యాఖ్యలు రాజకీయంగా సంచలనానికి కారణమయ్యాయి. నాడు జగన్ సీఎంగా ఉన్న సమయంలో ఆయన కార్యాలయం లో కొందరు అధికారుల తీరు.. నేతలు వ్యవహార శైలి పైన ఓపెన్ గానే వ్యాఖ్యలు చేసారు.
కాగా.. పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందని కేతిరెడ్డి ధీమా వ్యక్తం చేసారు. జగన్ కు విధేయుడగా ఉండే కేతిరెడ్డి వచ్చే ఎన్నికల కోసం కీలక నిర్ణయం తీసుకున్నారు. తనకు ఇమేజ్ తెచ్చిన గుడ్ మార్నింగ్ ధర్మవరం తిరిగి ప్రారంభించాలని డిసైడ్ అయ్యారు. ఈ మేరకు అధికారికంగా ప్రకటన చేసారు. ఎన్నో హామీలు ఇచ్చి గెలిచిన ఎమ్మెల్యే ప్రజలకు ఏమీ చేయలేదని సత్యకుమార్ పై విమర్శలు చేసిన కేతిరెడ్డి.. తాను ప్రజలలో ఉంటాను అని వారికి అండగా ఉంటాను అని వెల్లడించారు. దీంతో.. కేతిరెడ్డి గుడ్ మార్నింగ్ కార్యక్రమానికి ప్రజల నుంచి ఎలాంటి స్పందన ఉంటుందనేది ఆసక్తిగా మారుతోంది.
-
డీలిమిటేషన్ పై మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు -
బీహార్ సీఎంగా లాలూకు నమ్మినబంటు: నాడు రబ్రీదేవి కేబినెట్ లో మంత్రి -
జగన్ సీపీఆర్వో శ్రీహరి అరెస్ట్ కలకలం-హైకోర్టుకు వైసీపీ-డీజీపీకి ఘాటు లేఖ..! -
డీ లిమిటేషన్ వేళ రూటు మార్చిన జగన్ - ఢిల్లీ కేంద్రంగా కీలక పరిణామాలు...!! -
Sana Satish Babu: లోకేష్ సన్నిహితుడికి టీడీపీలో కీలక పదవి..! బిగ్ ప్రమోషన్..! -
Pawan Khera: కాంగ్రెస్ నేత పవన్ ఖేరాకు సుప్రీం షాక్-తెలంగాణ హైకోర్టు బెయిల్ పై..! -
మావిగాన్ ను జనాల్లోకి తీసుకెళ్తున్న టీడీపీ..! పేర్ని నాని షాకింగ్..! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్!












Click it and Unblock the Notifications