చంద్రబాబుతో కొణతాల భేటీ: విశాఖ టీడీపీలో కలకలం, అప్రమత్తమైన గంటా వర్గం
హైదరాబాద్: గత కొంతకాలంగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటున్న కొణతాల రామకృష్ణ, గండి బాబ్జీ తెలుగుదేశం పార్టీలోకి చేరేందుకు మార్గం సుగమనమైంది. కొణతాల రామకృష్ణతో పాటు గండి బాబ్జీని ముఖ్యమంత్రి నివాసానికి మంత్రి అయ్యన్న పాత్రుడు, ఏపీ టీడీపీ కమిటీ అధ్యక్షుడు కళా వెంకట్రావు మంగళవారం ఉదయం తీసుకొచ్చారు.
ఈ సందర్బంగా వారు చంద్రబాబుతో మంతనాలు సాగించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా కొణతాల, గండిబాబ్జీ చేరికను అంగీకరించినట్లుగా తెలుస్తోంది. దీంతో గతకొన్ని రోజులుగా కొణతాల రామకృష్ణ, గండి బాబ్జీ తెలుగుదేశం పార్టీలో చేరనున్నట్లు వస్తున్న వార్తలకు ఈరోజుతో తెరదించారు.

మంగళవారం జరిగిన టీడీఎల్పీ సమావేశంలో ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు కూడా పార్టీలోకి వచ్చే నేతలు ఎవరైనా ఉంటే వారిని అడ్డుకోవద్దంటూ మంత్రులకు సూచించినట్టుగా తెలుస్తోంది. కాగా ఈ భేటీని గంటాకు తెలియకుండా ఏర్పాటు చేసినట్లు సమాచారం.
దీంతో విశాఖపట్నం జిల్లా టీడీపీలో మళ్లీ కలకలం మొదలైంది. అయితే చంద్రబాబుతో కొణతాల భేటీ కావడాన్ని మీడియా ద్వారా తెలుసుకున్న గంటా వర్గం వెంటనే అప్రమత్తమైంది. చంద్రబాబుతో భేటీపై చర్చించేందుకు మంత్రి గంటా ఛాంబర్‌లో ఎమ్మెల్యేలు బండారు సత్యనారాయణమూర్తి, పంచకర్ల రమేష్ బాబు, పీలా గోవింద్, పి.గణబాబు అత్యవసరంగా సమావేశమయ్యారు.
దీంతో విశాఖకు చెందిన మంత్రులు గంటా శ్రీనివాసరావు, అయ్యన్న పాత్రుడు మధ్య వైరం తారాస్థాయికి చేరింది. కొణతాల రామకృష్ణను తెలుగుదేశంలోకి తీసుకొచ్చేందుకు మంత్రి అయ్యన్నపాత్రుడు గత కొన్నాళ్లుగా ట్రై చేస్తున్నారు. కొణతాల వస్తే విశాఖ జిల్లాలో పార్టీకి బలమని అయ్యన్న పాత్రడు పలు సందర్భాల్లో చెప్పారు.
అయితో విశాఖలో మరో మంత్రి గంటా శ్రీనివాసరావుకు చెక్ పెట్టడానికి కొణతాలను ఉపయోగించాలనేది అయ్యన్నపాత్రుడి ఆలోచనగా తెలుస్తోంది. గత కొన్నాళ్లుగా కొణతాలన రాకను గంటా వర్గం ఏదో రకంగా అడ్డుకుంటూనే ఉంది. తాజాగా కొణతాల ముఖ్యమంత్రితో భేటీ కావడంతో అన్ని ఆటంకాలు తొలగినట్లుగా భావిస్తున్నారు.
సీఎం చంద్రబాబుతో కొణతాల ఏం మాట్లాడరనే విషయం బయటకు రాకున్నా టీడీపీలో చేరడం మాత్రం ఖాయమని తెలుస్తోంది. నిజానికి గత శాసనమండలి ఎన్నికల సమయంలోనూ ఆయన టీడీపీలోకి రావడానికి ఏర్పాట్లు జరిగాయి. చంద్రబాబు సైతం పచ్చజెండా ఊపారు.
ఆయనతో పాటు పెందుర్తి మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీని కూడా చేర్చకోవాలని కొణతాల సూచించడంతో మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి అభ్యంతరం చెప్పారు. దీంతో అప్పటికి కొణతాల చేరిక తాత్కాలికంగా నిలిచిపోయిన సంగతి తెలిసిందే.












Click it and Unblock the Notifications