పవన్ కల్యాణ్ కు పూనకం వచ్చిందా ? కుటుంబాలను చీల్చి రాజకీయాలా ? ముద్రగడ ఫైర్ !
ఆంధ్రప్రదేశ్ లోని అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్నుడు పిఠాపురం అసెంబ్లీ నియోజక వర్గం హాట్ టాపిక్ అయ్యింది. పవర్ స్టార్, జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ పిఠాపురం నుంచ పోటీ చెయ్యడంతో ఆ నియోజక వర్గం నిత్యం వార్తల్లో ఉంది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్, జనసేన పార్టీ మీద కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం సంచలన వ్యాఖ్యలు చేశారు, మా కుటుంబంలో పవన్ కల్యాణ్ చిచ్చు పెట్టారని ముద్రగడ ఆరోపించారు.
పిఠాపురంలో వైసీపీ అభ్యర్థి వంగా గీత గెలుపుకోసం వైసీపీ నాయకుడు ముద్రగడ పద్మనాభం పని చేస్తున్నారు. అయితే ముద్రగడ పద్మనాభం కుమార్తె బహిరంగంగా ఆమె తండ్రి గురించి మాట్లాడుతూ మా నాన్న వైసీపీ ప్లాన్ కు బలి అవుతున్నారని, తాను మాత్రం పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు, జనసేనకు మద్దతు ఇస్తున్నానని ప్రకటించారు. ముద్రగడ కుమార్తె పవన్ కల్యాణ్ కు బహిరంగంగా మద్దతు ప్రకటించడంతో ఆయనతో పాటు వైసీపీ నాయకులు బిత్తరపోయారు.

ఇదే సమయంలో ముద్రగడ పద్మనాభం జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ను టార్గెట్ చేశారు. ఇటీవల మా కుటుంబంలో చిన్నపాటి గొడవలు జరిగాయని, దాని గురించి తాను బాధపడుతున్నానని ముద్రగడ అన్నారు. నా కుమార్తెను రోడ్డు మీదకు లాగారని, మీడియా సంస్థలు స్డూడియోలకు పిలిపించుకుని తనను టార్గెట్ చేసి మాట్లాడిస్తున్నారని, ఆమెతో ఇంటర్వూలు ఇప్పించి నా మీద ఆరోపణలు చేయిస్తున్నారని ముద్రగడ పద్మనాభం ఆరోపించారు.
తన కుమార్తెను ఇలా రోడ్డు మీదకులాగే బదలు పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలుపుకోసం ఇంటింటి ప్రచారం చేయించినా తాను ఏమాత్రం బాధపడనని, అయితే తన కుటుంబానని టార్గెట్ చేసుకుని నా కూతురిని రోడ్డు మీదకు లాగడం సహించలేకపోతున్నానని వైసీపీ నాయకుడు ముద్రగడ పద్మనాభం అంటున్నారు. పవన్ కల్యాణ్ చేసిన పనికి తాను సంస్కారం వదిలేసి మాట్లాడాల్సి వస్తోందని ముద్రగడ పద్మనాభం మండిపడ్డారు.
బయట తనకు ఎక్కువ గౌరవం ఇస్తున్నట్లు నటిస్తూ తనతో పాటు తన కుటుంబాన్ని అప్రతిష్ట పాలుజేయాలని పవన్ కల్యాణ్ ప్రయత్నిస్తున్నారని, తాను గతంలో చిరంజీవి గురించి, పవన్ కల్యాణ్ గురించి చెడుగా, తప్పుగా ఎక్కడా మాట్లాడలేదని ముద్రగడ అన్నారు. అయితే తనకు వ్యతిరేకంగా తన కుమార్తెతోనే వీళ్లు మాట్లాడిస్తున్నారని, మా కుటుంబాన్ని చీల్చడానికి పక్కాప్లాన్ వేశారని ముద్రగడ పద్మనాభం ఆరోపించారు.

పిఠాపురంలో పోటీ చేస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ కాకినాడ బహిరంగ సభలో ఒంటిమీదకు అమ్మోరు వచ్చినట్లు ఊగిపోతూ తనను ఎందుకు తిట్టాడని, తనను దూషించాల్సిన అవసరం ఏమి వచ్చిందని వైసీపీ నాయకుడు ముద్రగడ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ను విమర్శించారు. తన కూతురుకు ఎప్పుడో పెళ్లి అయిపోందని, ఆమెకు నా ఇంటి పేరులేదని, బహిరంగ సభలో ఈమె ముద్రగడ కుమార్తె అంటూ పవన్ కల్యాణ్ ఎందుకు పరిచయం చేశారని ముద్రగడ పద్మనాభం ప్రశ్నించారు.
బహిరంగ సభల్లో పూనకం వచ్చినట్లు ఊగిపోతున్న పవన్ కల్యాణ్ సంస్కారం, చిన్నాపెద్ద అని తేడా లేకుండా తనను ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, అందరికి శ్రీరంగ నీతులు చెబుతున్నాడని ముద్రగడ పద్మనాభం ఆరోపించారు. తన కుమార్తెను ఎక్కడా ఈమె ముద్రగడ కుమార్తె అని పరిచయం చెయ్యకూడదని, ఆమె ఇంటి పేరుకు తన ఇంటి పేరుకు ఎలాంటి సంబంధం లేదని, కుటుంబాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చెయ్యకూడదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం సూచించారు.
-
ఆళ్లగడ్డ టీడీపీలో కేబుల్ వార్.. భూమా అఖిల Vs సుబ్బారెడ్డి, బంపర్ ఆఫర్ తో చర్చ! -
AP Govt: ఏపీలో ఇవాళ 2.5 లక్షల మందికి ఇళ్లు-టిడ్కో లబ్దిదారులకూ..! -
ప్రకాష్ రాజ్ ఇంట తీవ్ర విషాదం.. పవన్ కళ్యాణ్ ఎమోషనల్ పోస్ట్ !! -
దేశంలో మోస్ట్ పవర్ ఫుల్ లీడర్ గా చంద్రబాబు.. ఇది ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే! -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
today rashiphalalu: నేడు కేతువుతో సహా ముఖ్య గ్రహాలు వీరికి ఇస్తున్నాయి సిరిసంపదలు!












Click it and Unblock the Notifications