వైసీపీ లీడర్ కు ఏమైయ్యింది, మహిళ హత్య కేసులో సెంట్రల్ జైల్లో !!
వైసీపీలో ఓ వెలుగు వెలిగిన నందిగం సురేష్ అనారోగ్యానికి గురయ్యారు. విషయం గుర్తించిన జైలు అధికారులు వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ ను గుంటూరులోని జీజీహెచ్ ఆసుపత్రికి తరలించారు. మహిళ హత్య కేసులో వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ ను అరెస్ట్ చేసే సమయంలో తనకు భుజనం నొప్పి ఎక్కువగా ఉందని వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ జైలు అధికారులకు చెప్పారు.
వైసీపీ అధికారం ఉన్న సమయంలో నందిగం సురేష్ ఓ వెలుగు వెలిగారు. ఆ సందర్బంలో సీఎం గా ఉన్న జగన్ కి సంబంధించిన అనేక కీలక విషయాలను నందిగం సురేష్ మీడియా ముందు చెప్పాడు. ఆ సందర్బంలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు ఇంటిపై దాడి జరిగింది. నారా చంద్రబాబు నాయుడు ఇంటిపై జరిగిన దాడి కేసులో నందిగం సురేష్ కూడా నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

గత నెలలో వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ ను హైదరాబాద్ లో అరెస్టు చేసి గుంటూరు సెంట్రల్ జైలుకు పంపించారు. ఇటీవల నందిగం సురేష్ కు ఈ కేసులో షరతులతో కూడిన బెయిల్ మంజూరు అయ్యింది. అయితే బెయిల్ కు సంబంధించిన షూరిటీలు సమర్పించక పోవడంతో నందిగం సురేష్ జైల్లోనే ఉండాల్సి వచ్చింది. అదే సమయంలో మరియమ్మ అనే మహిళ హత్య కేసులో నిందితుడిగా ఉన్న నందిగం సురేష్ ను పీటీ వారెంట్ తో పోలీసులు మరోసారి అరెస్టు చేసి కోర్టు ఆదేశాలతో ఆయన్ను గుంటూరు సెంట్రల్ జైలుకు తరలించారు.
మహిళా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ ఇప్పట్లో బెయిల్ పైన విడుదల అయ్యే అవకాశాలు తక్కువగా ఉన్నాయని న్యాయనిపుణలు అంటున్నారని సమాచారం. సెంట్రల్ జైలులో ఉన్న నందిగం సురేష్ ను పరామర్శించడానికి గత నెలలోనే మాజీ సీఎం జగన్ సెంట్రల్ జైలుకు వెళ్లారు. తరువాత జైల్లో నందిగం సురేష్ ను పరామర్శించిన జగన్ ఆంధ్రప్రదేశ్ లోని చంద్రబాబు ప్రభుత్వంపై విమర్శలు చేశారు. వైసీపీలో ఎంతో పలుకుబడి ఉండే నందిగం సురేష్ కు బెయిల్ కు సంబంధించిన షూరిటీలు ఇవ్వలేకపోవడం హాట్ టాపిక్ అయ్యింది. వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ కు జీజీహెచ్ ఆసుపత్రిలో వైద్యులు చికిత్స అందించారని, ఆయన కోరుకుంటున్నారని పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications